పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. నిన్న (శనివారం) ధరలు పెరగడంతో దేశ ఆర్థిక రాజధాని ముంబై, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు పట్టణంలోను లీటర్ పెట్రోల్ ధర రూ.100 క్రాస్ చేసింది. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు ఇంధన ధరలను సవరిస్తాయి. శనివారం ధరలు మరోసారి పెరగడంతో పలుచోట్ల పెట్రోల్ సెంచరీ కొట్టింది. ఇందులో తెలుగు రాష్ట్రంలోని పట్టణం గుంటూరు కూడా ఉంది.

15సార్లు పెరిగింది
ఈ నెల (మే నెల)లో ధరలు పెరగడం ఇది పదిహేనవసారి. లీటర్ పెట్రోల్ పైన నిన్న 26 పైసలు, లీటర్ డీజిల్ పైన 28 పైసలు పెరిగింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని చేరుకున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ రూ.100 దాటింది. మొత్తం 15 రోజుల వ్యవధిలోనే లీటర్ పెట్రోల్‌పై రూ.3.54, డీజిల్‌పై రూ.4.16 చొప్పున పెరిగింది.

గుంటూరు, ముంబైలో రూ.100 క్రాస్
నిన్నటి పెంపుతో గుంటూరు పట్టణంలో లీటర్ పెట్రోల్ ధర రూ.100లు దాటింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.100.12లు, డీజిల్ ధర రూ.94.44గా ఉంది. గుంటూరులో ప్రీమియం పెట్రోల్ రూ.103.58గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 99.92, డీజిల్ ధర రూ.94.24గా, విజయవాడలో లీటర్ ప్రీమియం పెట్రోల్ ధర రూ.103.38గా ఉంది. ఈ నెలలో పదిహేను రోజుల పాటు ధర పెరగడంతో చాలాచోట్ల పెట్రోల్ రూ.100 క్రాస్ చేసింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.94, డీజిల్ ధర రూ.84.89గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.19, డీజిల్ ధర రూ.92.17గా ఉంది.

పన్నులు
పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. ఉదాహరణకు ఢిల్లీలో చూసుకుంటే మే 16న లీటర్ పెట్రోల్ రూ.92.88గా ఉంది. ట్యాక్స్ బ్రేక్ చూసుకుంటే లీటర్ పెట్రోల్ బేస్ ప్రైస్ రూ.34.19. రవాణా తదితర ఖర్చులు 0.36 పైసలు. డీలర్స్‌కు వేసే ఛార్జ్ (ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ మినహా) రూ.34.55. ఎక్సైజ్ డ్యూటీ రూ.32.90. డీలర్ కమిషనర్ (యావరేజ్) రూ.3.77. వ్యాట్ రూ.21.36.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ మే 16వ తేదీన రూ.83.22గా ఉంది. ట్యాక్స్ బ్రేక్ చూస్తే బేస్ ప్రైస్ రూ.36.32. రవాణా తదితర ఖర్చులు 0.33 పైసలు. డీలర్స్‌కు వేసే ఛార్జ్ (ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ మినహా) రూ.36.65. ఎక్సైజ్ డ్యూటీ రూ.31.80. డీలర్ కమిషనర్ (యావరేజ్) రూ.2.58. వ్యాట్ రూ.12.19.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications