ఇప్పుడు న్యూయార్క్‌లో కంటే ముంబైలో పెట్రోల్ ధర ఎక్కువ
పెట్రోల్, డీజిల్ ధరలు జూన్ 1వ తేదీన సరికొత్త గరిష్టాన్ని తాకాయి. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీల ప్రకారం నేడు పెట్రోల్ పైన 26 పైసలు, డీజిల్ పైన 23 పైసలు పెరిగింది. తాజా పెరుగుదలతో ఢిల్లీలో నేడు పెట్రోల్ లీటర్ పైన రూ.94.49, డీజిల్ లీటర్ రూ.85.38గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.100 దాటింది. పెట్రోల్ రూ.100.72, డీజిల్ రూ.92.69కు చేరుకుంది.
మే 4వ తేదీ నుండి ఇది 17వ పెంపు. ఈ కాలంలో పెట్రోల్ పైన రూ.4.09, డీజిల్ పైన రూ.4.6555 పెరిగింది. రాజస్థాన్ లోని గంగానగర్‌లో లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.105.52కు చేరుకుంది. డీజిల్ రూ.98.32గా ఉంది. గ్యాసోలైన్ ధరలు ముంబైలో రూ.100 దాటింది. తద్వారా న్యూయార్క్ నగరంలో కంటే ఇక్కడే ఖరీదుగా మారింది.

అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. 2019 జనవరి నెలలో పెట్రోల్ ధర లీటర్ రూ.68.65గా ఉంది. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు బ్యారెల్‌కు 59.27గా ఉంది. గత ఏడాది కరోనా సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 20 డాలర్ల స్థాయికి పడిపోయాయి.
కానీ దేశీయంగా పన్నులు పెంచడంతో ఇక్కడ ధరలు తగ్గలేదు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు 2019 జనవరి స్థాయికి చేరుకున్నాయి. కరోనా సమయంలో పన్నులు పెంచడంతో దేశీయంగా అప్పుడు ఉన్న ధరలతో పోలిస్తే భారీగా పెరిగాయి. 2019 జనవరిలో బ్యారెల్ ఇంధనం 59.27 డాలర్లు కాగా, ప్రస్తుతం 67.05 డాలర్లుగా ఉంది. ఇదే సమయంలో అప్పుడు పెట్రోల్ లీటర్ రూ.68.55 కాగా, ఇప్పుడు రూ.93కు పైన ఉంది.


Click it and Unblock the Notifications