పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులేదు
పెట్రోల్, డీజిల్ ధరల్లో నేడు (మార్చి 28, ఆదివారం) ఎలాంటి మార్పులేదు. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకారం వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.90.78, డీజిల్ రూ.81.10, ముంబైలో పెట్రోల్ రూ.97.19, డీజిల్ రూ.88.20, చెన్నైలో పెట్రోల్ రూ.92.77, డీజిల్ రూ.86.10, కోల్‌కతాలో పెట్రోల్ రూ.90.98, డీజిల్ రూ.83.98గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల ధరలు తగ్గడంతో దేశీయ మార్కెట్లోను పెట్రోల్, డీజిల్ ధరలు రెండు రోజులు తగ్గాయి.
గతవారం ప్రారంభంలో బ్రెంట్ క్రూడాయిల్, డబ్ల్యుటీఐ క్రూడ్ ధరలు దాదాపు ఆరు శాతం పెరిగాయి. ఆ తర్వాత మళ్లీ పడిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ ఆందోళనలు, డిమాండ్ పడిపోతుందనే అంచనాలు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడానికి కారణమయ్యాయి. దానికి తోడు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం వంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం కూడా దేశీయంగా ధరలు తగ్గడానికి కారణంగా భావిస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో OMCలు ధరల సవరణలను నిలిపివేశాయని, పైగా ఇప్పుడు తగ్గించాయని చెబుతున్నారు.

కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ పైన వేసిన అదనపు సుంకాన్ని తగ్గించవలసి ఉంది. గత ఏడాది పెట్రోల్ పైన రూ.13, డీజిల్ పైన రూ.16 పెంచింది ప్రభుత్వం. రాష్ట్రాలు కరోనా సెస్ విధించాయి. ఇప్పుడు ఒక్కో పన్ను భారం తగ్గుతుంటే పెట్రో భారం కూడా కాస్త తగ్గనుంది.


Click it and Unblock the Notifications