ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం (నవంబర్ 20) స్వల్పంగా పెరిగాయి. 48 రోజుల పాటు నిలకడగా ఉన్న ధరలు నేడు పెరుగుదలను నమోదు చేశాయి. ఢిల్లీ, ముబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ మెట్రో నగరాలు సహా అంతటా పెట్రోల్ లీటర్‌కు 17 పైసల నుండి 20 పైసల మధ్య, డీజిల్ ధర లీటర్‌కు 22 పైసల నుండి 25 పైసల మధ్య పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర నిన్నటి వరకు రూ.81.06 ఉండగా నేడు రూ.81.23కు పెరగింది. డీజిల్ ధర రూ.70.46 నుండి రూ.70.68కు పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.87.74 నుండి రూ.87.92కు, డీజిల్ ధర లీటర్ రూ.76.86 నుండి రూ.77.11కు పెరిగింది. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుండి అమలులోకి వచ్చాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, భారత్ పెట్రోలియం కార్పోరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ చమురు ధరలు... దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ధరల పైన ప్రభావం చూపుతాయి.

ఏ నగరంలో ఎంత?
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.81.23, లీటర్ డీజిల్ రూ.70.68, ముంబైలో పెట్రోల్ రూ.87.92, డీజిల్ రూ.77.11, చెన్నైలో పెట్రోల్ రూ.84.31, డీజిల్ రూ.76.17, కోల్‌కతాలో పెట్రోల్ రూ.82.79, డీజిల్ రూ.74.24గా ఉంది. ఇక, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 22 పైసలు పెరిగి రూ.85.47కు చేరగా, డీజిల్ లీటర్ ధర 28 పైసలు పెరిగి రూ.77.12గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు శుక్రవారం క్షీణించాయి. అమెరికాతో పాటు వివిధ దేశాల్లో కరోనా కేసులు పెరగడం, కరోనా ఆంక్షల నేపథ్యంలో చమురు ధరలపై ప్రభావం ఉంటుంది. కేసులు పెరగడంతో చమురు డిమాండ్ తగ్గుతుందనే ఆందోళనలు నెలకొన్నాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 0.25 శాతం పెరిగి 44.30 డాలర్ల వద్ద, న్యూయార్క్ నైమెక్స్‌లో బ్యారెల్ 41.74 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications