Petrol, Diesel Rates: రెండో రోజు స్థిరంగా పెట్రోల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు భారీగా తగ్గాయి. ఇటీవల మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి దీపావళి శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా లీటర్ పెట్రోల్, డీజిల్ పైన రూ.7 చొప్పున తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపు పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 మాత్రమే వర్తిస్తోంది. అసోం, మణిపూర్, గోవా, త్రిపుర, కర్నాటక వంటి రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపుకు రాష్ట్రాలు తోడు కావడంతో పెట్రోల్ పైన రూ.12, డీజిల్ పైన రూ.17 తగ్గింది. మందగమనం, కరోనా వంటి కఠిన పరిస్థితుల్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగి, ఇక్కడ కూడా ధరలు ఆకాశాన్ని అంటాయి. ధరలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో గత మూడేళ్లలో మొదటిసారి కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. దీంతో చాలాచోట్ల డీజిల్ ధరలు రూ.100 దిగువకు వచ్చాయి. పెట్రోల్ ధరలు కూడా కాస్త తగ్గాయి.
తాజాగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 103.97, లీటర్ డీజిల్ ధర 86.67, ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 109.98, డీజిల్ ధర 94.14, చెన్నైలో పెట్రోల్ ధర 101.40, డీజిల్ ధర 91.43, కోల్‌కతాలో పెట్రోల్ ధర 104.67, డీజిల్ ధర 89.79, భోపాల్‌లో పెట్రోల్ ధర 112.56, డీజిల్ ధర 95.40, హైదరాబాద్‌లో డీజిల్ రూ.94.62, లీటర్ పెట్రోల్ రూ.108.20గా ఉంది. అయితే ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

దేశీయ అవసరాల్లో భారత్ 86 శాతం చమురును దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఇంధన ధరల నియంత్రణ ప్రభుత్వాల చేతుల్లో ఉండదని గుర్తు చేశారు. అంతర్జాతీయస్థాయిలో డిమాండ్-సరఫరాకు అనుగుణంగా ధరలు మారుతుంటాయని చెబుతున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరగడానికి కరోనా సంక్షోభం కారణమన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోతే ధరలు పెరుగుతాయని గుర్తు చేస్తున్నారు. అలాగే చమురు రంగంపై ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టకపోవడం కూడా ధరలు ప్రభుత్వాల చేతిలో ఉండకపోవడానికి ఓ కారణమన్నారు. కేవలం పునరుత్పాదక, హరితఇంధనంపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంధన ధరలు మరింత పెరిగి, 2023 నాటికి లీటర్ ముడి చమురు మరో రూ.100 పెరగవచ్చునని అంటున్నారు.


Click it and Unblock the Notifications