For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులేదు, ఈ నగరాల్లో సెంచరీ క్రాస్

|

పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (శుక్రవారం 25, జూన్) స్థిరంగా ఉన్నాయి. జూన్ 24వ తేదీన ఇంధన ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ పైన 26 పైసలు, లీటర్ డీజిల్ పైన 7 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.97.76 వద్ద, డీజిల్ రూ.88.30 వద్ద ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.103.89, లీటర్ డీజిల్ రూ.95.79గా ఉంది. మే నెలలో పెట్రోల్ 16సార్లు పెరగగా, ఈ నెలలో 13 సార్లు పెరిగింది.

తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 పైకి చేరుకుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లడక్, కర్నాటక, జమ్ము-కాశ్మీర్, ఒడిశా రాష్ట్రాలలో రూ.100 దాటింది. రాజధానుల్లో భోపాల్‌లో తొలిసారి గత నెలలో రూ.100 దాటింది పెట్రోల్. ఆ తర్వాత జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరులలో క్రాస్ చేసింది. ఇటీవల పాట్నా, తిరువనంతపురంలలోను సెంచరీకి చేరువలో ఉంది. పాట్నాలో రూ.99.80, తిరువనంతపురంలో రూ.99.74గా ఉంది.

 Petrol, Diesel Prices Unchanged On Friday

వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు...
ఢిల్లీలో పెట్రోల్ 97.76, డీజిల్ 88.30
ముంబైలో పెట్రోల్ 103.89, 95.79
కోల్‌కతాలో పెట్రోల్ 97.63, డీజిల్ 91.15
చెన్నైలో పెట్రోల్ 98.88, డీజిల్ 92.89
బెంగళూరులో పెట్రోల్ 101.03, డీజిల్ 93.61
హైదరాబాద్‌లో పెట్రోల్ 101.60, డీజిల్ 96.25
పాట్నాలో పెట్రోల్ 99.80, డీజిల్ 93.63
భోపాల్‌లో పెట్రోల్ 105.99, డీజిల్ 97.00
జైపూర్‌లో పెట్రోల్ 104.44, డీజిల్ 97.35
లక్నోలో పెట్రోల్ 94.95, డీజిల్ 88.71
తిరువనంతపురంలో పెట్రోల్ 99.74, డీజిల్ 94.82

English summary

పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులేదు, ఈ నగరాల్లో సెంచరీ క్రాస్ | Petrol, Diesel Prices Unchanged On Friday

In New Delhi, the petrol prices are steady at ₹ 97.76 per litre and diesel prices are at ₹ 88.30 per litre.
Story first published: Friday, June 25, 2021, 20:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X