సరికొత్త గరిష్టాలకు పెట్రోల్, డీజిల్ ధరలు: ఆర్థిక రికవరీపై డీజిల్ ధరల ప్రభావం
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఎనిమిదో రోజు పెరిగాయి. దేశవ్యాప్తంగా పలుచోట్ల ధరలు సరికొత్త రికార్డును నమోదు చేశాయి. నేడు (ఫిబ్రవరి 16, మంగళవారం) లీటర్ పెట్రోల్, డీజిల్ పైన దాదాపు 30 పైసలు 35 పైసలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో దేశీయ చమురురంగ కంపెనీలు ధరలను పెంచాయి. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. డీజిల్ ధరల ప్రభావం నిత్యావసర వస్తువులపై ఉంటుంది.

వివిధ నగరాల్లో ధరలు
లీటర్ పెట్రోల్ ధరల వివిధ నగరాల్లో ఇలా ఉంది. ఢిల్లీలో రూ.88.99 నుండి నేడు రూ.89.29కి పెరిగింది. ఢిల్లీలో ఈ స్థాయిలో ధర ఎప్పుడూలేదు. అయితే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ధరలతో పోలిస్తే ఢిల్లీలో కాస్త మెరుగు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈ రాష్ట్రాల్లో ధరలు ఎక్కువగా ఉన్నాయి. ముంబైలో రూ.95.75గా ఉంది.
పర్బనీ వంటి జిల్లాలో పెట్రోల్ ధర రూ.100 దాటింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో సెంచరీకి దగ్గరగా ఉంది. ఇక్కడ సగటున పెట్రోల్ ధర ఇప్పుడు రూ.98 నుండి రూ.99 మధ్య ఉంది. కోల్‌కతాలో రూ.90.54, చెన్నైలో రూ.91.45, బెంగళూరులో రూ.92, జైపూర్‌లో రూ.95.75గా ఉంది. దేశంలోని 14 మెట్రో నగరాల్లో 9 మెట్రోల్లో పెట్రోల్ ధర రూ.90ని క్రాస్ చేసింది. హైదరాబాద్‌లో రూ.92.84గా ఉంది.

డీజిల్ ధరలు
గత ఎనిమిది రోజుల్లో పెట్రోల్ ధర లీటర్ పైన రూ.2.36 పెరిగింది. ఢిల్లీలో ఈ సమయంలో రూ.2.91 పెరిగింది. ఢిల్లీలో మొదటిసారి రూ.89 క్రాస్ చేసింది. ఇక, లీటర్ డీజిల్ వివిధ నగరాల్లో ఇలా ఉంది. హైదరాబాద్‌లో రూ.86.93గా ఉంది. ఢిల్లీలో డీజిల్ రూ.80కి సమీపంలో ఉంది.
ఢిల్లీలో రూ.79.70, ముంబైలో రూ.86.72, చెన్నైలో రూ.84.77, బెంగళూరులో రూ.84.49, పాట్నాలో రూ.84.92, లక్నోలో రూ.80.07, జైపూర్‌లో రూ.88.07, గురుగ్రామ్‌లో రూ.80.27గా ఉంది. రాజస్తాన్‌లో డీజిల్ దాదాపు రూ.88-99 మధ్య ఉంది. రాజస్థాన్ శ్రీగంగానగర్‌లో రూ.91ని దాటింది. 14 ప్రధాన నగరాల్లో తొమ్మిదింట డీజిల్ రూ.80 దాటింది.

ఎకనమిక్ రికవరీపై ప్రభావం
డీజిల్ ధరల పెరుగుదల ఎకనమిక్ రికవరీకి కాస్త అడ్డంకిగా మారవచ్చునని భావిస్తున్నారు. వ్యాపార కార్యకలాపాలకు, పరిశ్రమలకు డీజిల్ వినియోగిస్తారు. డీజిల్ ధరలు పెరిగితే ఈ ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడుతుంది.


Click it and Unblock the Notifications