For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Petrol prices today: నెలకు పైగా స్థిరంగా పెట్రోల్ ధరలు

|

పెట్రోల్, డీజిల్ ధరలు నెలకు పైగా స్థిరంగా ఉన్నాయి. చమురు ధరలు వరుసగా 33వ రోజు మంగళవారం(డిసెంబర్ 07) స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. కొద్ది రోజుల క్రితం మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి దీపావళికి శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపు పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 మాత్రమే వర్తిస్తోంది. ఇటీవల ఢిల్లీలోను అక్కడి ప్రభుత్వం వ్యాట్‌‍ను తగ్గించింది. వ్యాట్‌ను ముప్పై శాతం నుండి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర రూ.8 తగ్గింది.

దీంతో వివిధ పెద్ద నగరాలతో పోలిస్తే ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. అయితే దేశంలో అత్యంత తక్కువగా పోర్ట్‌బ్లెయిర్‌లో ఉన్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.82.96, లీటర్ డీజిల్ రూ.77.13గా ఉంది. అంటే పోర్ట్‌బ్లెయిర్ కంటే ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.12 ఎక్కువగా ఉంది. ఢిల్లీలో పెట్రోల్ రూ.95.41, చెన్నైలో రూ.101.40, ముంబైలో రూ.109.98, హైదరాబాద్‌లో రూ.108.20, ఢిల్లీలో డీజిల్ రూ.95.41, ముంబైలో రూ.94.14, హైదరాబాద్‌లో రూ.94.62గా ఉంది.

Petrol, diesel prices today: Rates static on 07 December

అంతర్జాతీయంగా చమురు ధరలు ఇటీవల భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా ధరలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.108.20, లీటర్ డీజిల్ రూ.94.62గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.36, లీటర్ డీజిల్ రూ.96.45గా ఉంది. ఢిల్లీలో పెట్రోల్ రూ.103.97, డీజిల్ రూ.86.67, ముంబైలో పెట్రోల్ రూ.109.98, డీజిల్ రూ.94.14గా ఉంది.

యూరోపియన్ ప్రాంతంలో కరోనా కేసులు పెరగడం, జపాన్, భారత్ వంటి దేశాల్లో చమురు నిల్వలు ఉండటం, ఈ దేశాల్లో ఓవర్-సప్లై, బలహీనమైన డిమాండ్ ఉండటం వంటి అంశాలు ప్రభావం చూపనున్నాయి.

Petrol, diesel prices today: Rates static on 07 December

బ్రెంట్ క్రూడ్, యూఎస్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 11.55 శాతం తగ్గి 72.72 డాలర్లకు వచ్చింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ ధర 12.06 శాతం క్షీణించి 68.15 డాలర్లకు వచ్చింది. యూరోపియన్ దేశాల్లో కరోనా కేసుల ఆందోళన నేపథ్యంలో చమురు డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నారు. దీంతో అంతర్జాతీయంగా ధరలు భారీగా క్షీణించాయి.

అంతర్జాతీయంగా ధరలు తగ్గించడం వల్ల ఇప్పుడు భారత్‌లోను ఈ ధరలు మరింత తగ్గిస్తారా అంటే, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు మరికొద్ది రోజులు క్షీణిస్తేనే అది వర్తిస్తుందని అంటున్నారు. దేశీయ రిటైల్ ధరలు 15 రోజుల రోలింగ్ యావరేజ్ విధంగా నిర్ణయించబడుతాయి. కాబట్టి గ్లోబల్ మార్కెట్లో మరిన్ని రోజులు తగ్గితేనే ఇక్కడా తగ్గుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో నవంబర్ 25వ తేదీ వరకు ధరలు గరిష్టాల వద్ద ఉన్నాయి. ధరలు గత రెండు రోజులుగా మాత్రమే పడిపోయాయి.

English summary

Petrol prices today: నెలకు పైగా స్థిరంగా పెట్రోల్ ధరలు | Petrol, diesel prices today: Rates static on 07 December

Petrol and diesel prices remained unchanged for over a month on Tuesday, 06 December except for Delhi where it became cheaper.
Story first published: Tuesday, December 7, 2021, 7:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X