పెట్రోల్, డీజిల్ ధరలు నేడు(మార్చి 29, మంగళవారం) పెరిగాయి. నవంబర్ 4, 2021 తర్వాత స్థిరంగా ఉన్న ధరలు మార్చి 22వ తేదీ నుండి పెరుగుతున్నాయి. వరుసగా రెండు రోజుల పెరుగుదల అనంతరం ఒకరోజు స్థిరంగా ఉంది. ఆ తర్వాత మళ్లీ పెరుగుతోంది. ఒకరోజు మాత్రమే 30 పైసలు పెరిగింది. 22వ తేదీ నుండి ఎనిమిదిసార్లు పెరిగింది. ఒకరోజు స్థిరంగా, మరొకరోజు 30 పైసలు పెరిగింది. మిగతా ఆరు రోజులు 80 పైసల చొప్పున పెరిగింది.
తాజా పెరుగుదలతో ఢిల్లీలో పెట్రోల్ రూ.100కు చేరుకుంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.100.21, డీజిల్ రూ.91.47గా ఉంది.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.113.61, డీజిల్ రూ.99.84 వద్ద ఉంది. ఓ వైపు ధరలు పెరుగుతుండగా, మరోవైపు హైదరాబాద్‌లో పలుచోట్ల నో-స్టాక్ బోర్డు కనిపిస్తోంది. పెట్రోలియం కంపెనీలు గతంలో క్రెడిట్ ఇచ్చేవని, ఇప్పుడు సరఫరా చేయాలంటే ముందుగానే పేమెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయని బంకు యజమానులు చెబుతున్నారు. ప్రస్తుతం బంకు యజమానులు నష్టాల్లో ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో డబ్బులు కడితేనే పెట్రోల్, డీజిల్ పంపిస్తున్నట్లు చెబుతున్నారు.

అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఇటీవల భారీగా పెరిగి, ఆ తర్వాత కాస్త శాంతించాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లుగా కనిపించడంతో ధరలు కాస్త క్షీణించాయి. అయినప్పటికీ నాలుగు నెలల క్రితం ధరతో పోలిస్తే దాదాపు 30 డాలర్లు పెరిగింది. దీపావళి తర్వాత మన వద్ద ధరలు పెరగలేదు. ఎన్నికలు, ఎన్నికల ఫలితాల తర్వాత పెరుగుతాయని భావించినప్పటికీ పెరగలేదు. దీపావళికి ముందు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ 70 డాలర్లకు కాస్త పైన ఉంది. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో 130 డాలర్లు దాటినప్పటికీ, ప్రస్తుతం కాస్త తగ్గి 110 డాలర్ల వద్ద ఉంది. నాలుగు నెలల్లో దాదాపు 30 డాలర్లు పెరగడంతో ధరలు పెరుగుతాయనే అంచనాలు మొదటి నుండి ఉన్నాయి. కానీ చాలా ఆలస్యంగా పెరిగాయి.
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (మార్చి 29, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications