స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు: క్రూడ్ ఎఫెక్ట్, ధరలు పెరగవచ్చా?
ఓ వైపు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే మన వద్ద మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన ట్యాక్స్‌ను తగ్గించింది. దీంతో ధరలు సామాన్యులకు ఊరటను ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ఇప్పుడు 96.72 వద్ద, హైదరాబాద్‌లో రూ.110 లోపు ఉంది. అంతకుముందు ఢిల్లీలో రూ.106, హైదరాబాద్‌లో రూ.120గా ఉంది. కేంద్రం ఇప్పటికి రెండుసార్లు ట్యాక్స్‌ను తగ్గించింది. కొన్ని రాష్ట్రాలు అధిక వ్యాట్‌ను వసూలు చేస్తున్నాయి. వ్యాట్ తగ్గిస్తే సామాన్యులకు మరింత ఊరట దక్కుతుంది.
పెట్రోల్, డీజిల్ ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం, జూన్ 7వ తేదీన ధరలో ఎలాంటి మార్పులేదు. చివరిసారి 6, ఏప్రిల్ రోజున లీటర్ పెట్రోల్ పైన పెరిగింది. మార్చి 22వ తేదీ నుండి పక్షం రోజుల పాటు మొత్తం రూ.10 వరకు పెరిగింది. ఆ తర్వాత స్థిరంగా ఉంది. అయితే కేంద్రం గత నెలలో ట్యాక్స్ తగ్గించడంతో ధరలు క్షీణించాయి.

కేంద్రం ట్యాక్స్ తగ్గింపు తర్వాత ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62, ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.109.27, డీజిల్ రూ.95.84, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 109.66, డీజిల్ రూ.97.82గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు గత కొంతకాలంగా స్థిరంగా ఉంటున్నాయి. కొద్ది రోజుల క్రితం 100 డాలర్ల దిగువకు వచ్చిన బ్రెంట్ క్రూడ్ 120 డాలర్లు క్రాస్ చేసింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ కూడా అదే స్థాయిలో ఉంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలు పెంచే అవకాశముంది.


Click it and Unblock the Notifications