పెట్రోల్, డీజిల్ ధరలు నేడు(జూలై 9 శుక్రవారం) స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో ఇంధన ధరలు ఆల్ టైమ్ గరిష్టం వద్ద ఉన్నాయి. మొత్తం నాలుగు మెట్రో నగరాల్లో కూడా పెట్రోల్ ధరలు సెంచరీ దాటాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై నగరాల్లో రూ.100 దాటింది. జూలై 8న పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. వరుసగా రెండు రోజులు జూలై 7, జూలై 8 తేదీల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి.
గురువారం లీటర్ పెట్రోల్ పైన 35 పైసలు, లీటర్ డీజిల్ పైన 9 పైసలు పెరిగాయి. తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.100.56డీజిల్ రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.59,లీటర్ డీజిల్ రూ.97.18గా ఉంది. పెట్రోల్‌కు రూ.100 దాటిన మెట్రో నగరాల్లో ఢిల్లీ చివరిది.

ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానుల్లో పెట్రోల్ ధర రూ.100 దాటిన మొదటి నగరం భోపాల్. ఆ తర్వాత జైపూర్, ముంబై, హైదరాబాద్, అమరావతి, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురంలలో పెట్రోల్ ధర సెంచరీ దాటింది. గతవారం తమిళనాడు రాజధాని చెన్నై, ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో పెట్రోల్ రికార్డు మార్కును క్రాస్ చేసింది. జూలై నెలలో ఢిల్లీ, కోల్‌కతా నగరాలు కూడా ఈ జాబితాలో చేరాయి.
మొత్తం పదహారు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, జమ్ము కాశ్మీర్, ఒడిశా, లడక్, బీహార్, కేరళ, తమిళనాడు, సిక్కిం, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ నగరాల్లో సెంచరీ దాటింది. రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో డీజిల్ గరిష్టస్థాయికి చేరుకుంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో అత్యధికం పన్నులే. కేంద్ర, రాష్ట్రాల పన్నుల వాటా 60 శాతం ఉంటుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నాయి.
Delhi: పెట్రోల్- ₹100.56, డీజిల్ - రూ.89.62
Mumbai: పెట్రోల్- ₹106.59, డీజిల్ - ₹97.18
Kolkata: పెట్రోల్- ₹100.62, డీజిల్ - ₹92.65
Chennai: పెట్రోల్- ₹101.37, డీజిల్ - ₹94.15
Bengaluru: పెట్రోల్- ₹103.94, డీజిల్ - ₹94.99
Hyderabad: పెట్రోల్- ₹104.50, డీజిల్ - ₹97.68
Thiruvananthapuram: పెట్రోల్- ₹102.54, డీజిల్ - ₹96.20
Jaipur: పెట్రోల్- ₹107.37, డీజిల్ - ₹98.74
More From GoodReturns

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications