ఇంధన ధరల్లో వరుసగా రెండో రోజు మార్పులేదు. నేడు (జూలై 14, బుధవారం) పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇటీవల పెరుగుదలతో ధరలు సరికొత్త గరిష్టాన్ని తాకిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం పెట్రోల్ ధర స్వల్పంగా పెరగగా, డీజిల్ ధర దాదాపు అంతే స్థాయిలో తగ్గింది. దాదాపు మూడు నెలల తర్వాత డీజిల్ ధర జూలై 12వ తేదీన స్వల్పంగా తగ్గింది. మే 4వ తేదీ నుండి ఇంధన ధరలు 39సార్లు పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ సెంచరీ దాటింది.
నాలుగు ప్రధాన మెట్రో నగరాల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పెట్రోల్ ధర ఎక్కువగా ఉంది. ఇక్కడ రూ.107 క్రాస్ చేసింది. డీజిల్ ధర కూడా ఎక్కువే ఉంది. మొన్నటి పెరుగుదలతో ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.107.20, డీజిల్ 27 పైసలు తగ్గి రూ.97.29 వద్ద ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.101.92, లీటర్ డీజిల్ రూ.94.24, కోల్‌కతాలో పెట్రోల్ రూ.101.35, డీజిల్ రూ.92.81గా ఉంది. పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్‌కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్ తదితర నగరాలు ఉన్నాయి.

పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 54 శాతం పన్నులు. కేంద్రం పెట్రోల్ పైన రూ.32.90, డీజిల్ పైన రూ.31.80 వేస్తుంది. ఇక ఆయా రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. దీంతో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు మారుతుంటాయి. రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ విధిస్తుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.
More From GoodReturns

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications