చమురురంగ కంపెనీలు సోమవారం(మార్చి 8) పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్‌కు 18 నెలల గరిష్టం 70 డాలర్లకు చేరుకున్నప్పటికీ దేశీయంగా మాత్రం చమురు ధరలు పెరగలేదు. నేడు దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91.17, డీజిల్ రూ.81.47గా ఉంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. వరుసగా తొమ్మిదో రోజు ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులేదు.

చివరిసారి గత నెలలో పెంపు
పెట్రోల్, డీజిల్ ధరలు చివరిసారి గత నెల ఫిబ్రవరి 27వ తేదీన పెరిగాయి. ఢిల్లీలో అప్పుడు పెట్రోల్ ధర 24 పైసలు, డీజిల్ ధర 15 పైసలు పెరిగింది. ఢిల్లీలో పెట్రోల్ రూ.91.17, డీజిల్ రూ.81.47, ముంబైలో పెట్రోల్ రూ.97.57, డీజిల్ రూ.88.60కు పెరిగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 క్రాస్ చేసింది. భారత్‌లో చమురు పైన అత్యధికంగా పన్నులు ఉంటాయి.

నెలలో ఎంత పెరిగిందంటే
ఫిబ్రవరి 9వ తేదీ నుండి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఈ కాలంలో 14 సార్లు పెరిగాయి. ఈ నెల రోజుల్లో పెట్రోల్ లీటర్‌కు రూ.4.22, డీజిల్‌కు ఢిల్లీలో రూ.4.34 పెరిగింది. 2021లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటి వరకు 26సార్లు పెరిగాయి. పెట్రోల్ రూ.7.46, డీజిల్ రూ.7.60 పెరిగింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతోన్న విషయం తెలిసిందే.

జీఎస్టీ పరిధిలోకి వస్తేనే..
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ, ఈ చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.75కు దిగి వస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై విధించే వ్యాట్, ట్యాక్స్‌లు ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంటోంది. అందుకే ప్రభుత్వాలు వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు నాయకులు సుముఖంగా ఉండరని అంటున్నారు.
More From GoodReturns

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications