Petrol prices today: వరుసగా పదకొండో రోజు స్థిరంగా పెట్రోల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పదకొండో రోజు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం, ఏప్రిల్ 17వ తేదీన ధరల్లో ఎలాంటి మార్పులేదు. చివరిసారి 6, ఏప్రిల్ రోజున లీటర్ పెట్రోల్ పైన 80 పైసలు పెరిగింది. మార్చి 22వ తేదీ నుండి పెరుగుదల ప్రారంభమైంది. మొత్తం రూ.10 వరకు పెరిగింది. ఇటీవల స్థిరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41, లీటర్ డీజిల్ ధర రూ.96.67 వద్ద ఉంది. గురుగ్రామ్‌లో పెట్రోల్ రూ.105.86, డీజిల్ రూ.97.10గా ఉంది.
మార్చి 22వ తేదీ నుండి దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను సవరిస్తున్నాయి. నవంబర్ 4వ తేదీ నుండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. నాలుగున్నర నెలల పాటు స్థిరంగా ఉన్న ధరలు మార్చి 22వ తేదీ వరకు స్థిరంగానే కొనసాగాయి.

ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.120.51, డీజిల్ రూ.104.77, చెన్నైలో పెట్రోల్ రూ.110.85, డీజిల్ రూ.100.94, కోల్‌కతాలో పెట్రోల్ రూ.115.12, డీజిల్ రూ.99.83, బెంగళూరులో పెట్రోల్ రూ.111.09, డీజిల్ రూ.94.79గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.119.49, డీజిల్ రూ.105.49 వద్ద ఉంది.


Click it and Unblock the Notifications