చమురురంగ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రెండవ రోజు తగ్గించాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ పైన 17 పైసలు, డీజిల్ పైన 22 పైసలు తగ్గింది. దేశ రాజధానిలో రెండు రోజుల్లో పెట్రోల్ ధర 31 పైసలు, డీజిల్ ధర 37 పైసలు తగ్గింది. తాజా తగ్గుదల అనంతరం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.81.55, లీటర్ డీజిల్ రూ.72.56గా ఉంది. గత పదిహేను రోజుల్లో డీజిల్ ధరలు ఏడు రోజులు క్షీణించాయి. సెప్టెంబర్ 3, 5, 7, 10, 12, 14, 15 తేదీల్లో తగ్గుముఖం పట్టాయి.
పెట్రోల్ ధరలు ఈ పదిహేను రోజుల్లో 4 రోజులు క్షీణించాయి. సెప్టెంబర్ 10, 12, 14, 15వ తేదీల్లో ధరలు తగ్గాయి. ఢిల్లీలో సెప్టెంబర్ మాసంలో 53 పైసలు తగ్గగా, డీజిల్ ధరలు రూ.1 తగ్గింది. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు... ఢిల్లీలో ఈ రోజు పెట్రోల్ ధర రూ.81.55/litre, ముంబైలో రూ.88.21/litre, చెన్నైలో రూ.84.57/litre, కోల్‌కతాలో రూ.83.06/litre, హైదరాబాద్‌లో రూ.84.75/litre, బెంగళూరులో రూ.84.20/litre, గురుగ్రామ్‌లో రూ.77.92/litre, నోయిడాలో రూ.81.95/litreగా ఉంది.

ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.72.56/litre, ముంబైలో రూ.79.05/litre, చెన్నైలో రూ.77.91/litre, కోల్‌కతాలో రూ.76.06/litre, హైదరాబాద్‌లో రూ.79.08/litre, బెంగళూరులో రూ.76.82/litre, గురుగ్రామ్‌లో రూ.73.03/litre, నోయిడాలో రూ.72.87/litreగా ఉంది.
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్(IOC), భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (BPCL), హిందూస్తాన్ పెట్రోలియం లిమిటెడ్ (HPCL)లు వరుసగా 82 రోజుల పాటు ధరలను సమీక్షించలేదు. తిరిగి ధరలు సవరించడం ప్రారంభించిన జూన్ 7వ తేదీ నుండి జూలై 25వ తేదీ మధ్య డీజిల్ ధరలు రూ.12.55 పైసలు పెరిగాయి. జూన్ 7వ తేదీ నుండి జూన్ 29వ తేదీ మధ్య పెట్రోల్ రూ.9.17 పైసలు పెరిగింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications