పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం (మార్చి 30) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. చమురురంగ కంపెనీలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ధరలను సవరిస్తాయి. నేడు పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 22 పైసలు, డీజిల్ 23 పైసలు తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.90.56 నుండి రూ.90.78కు పెరిగింది. లీటర్ డీజిల్ రూ.80.87 నుండి రూ.81.10కు పెరిగింది. ఇటీవలి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇటీవల రెండు రోజుల పాటు పెరిగింది.

వివిధ నగరాల్లో ధరలు
ఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ.90.56, ముంబైలో రూ.96.98, కోల్‌కతాలో రూ.90.77, చెన్నైలో రూ.92.58, నోయిడాలో రూ.88.91, బెంగళూరులో రూ.93.59, హైదరాబాద్‌లో రూ.94.16, జైపూర్‌లో రూ.97.08, లక్నోలో రూ.88.85, పాట్నాలో రూ.92.89గా ఉంది. డీజిల్ లీటర్ రూ.87.96, రూ.83.75, చెన్నైలో రూ.85.88గా ఉంది. ప్రభుత్వాల పన్నులు, వ్యాట్‌తో డొమెస్టిక్ ఫ్యూయల్ ధరలు వివిధ నగరాల్లో వివిధ రకాలుగా ఉంటాయి.

మూడో రోజు తగ్గుదల
పెట్రోల్, డీజిల్ ధరలు గత ఆరు రోజుల కాలంలో రెండోసారి తగ్గాయి. క్రితంసారి వరుసగా రెండు రోజులు తగ్గగా, నేడు మరోసారి తగ్గింది. ఈ నెలలో మూడోసారి ధరలు తగ్గాయి. గతవారం బుధ, గురువారం.. వరుసగా రెండు రోజులు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాయి చమురు రంగ కంపెనీలు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ లీటర్ రూ.100 క్రాస్ చేసింది. అన్ని నగరాల్లోను ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఇలాంటి సమయంలో ధరలను స్వల్పంగా తగ్గించి, వినియోగదారులకు ఓఎంసీలు స్వల్ప ఊరటను ఇచ్చాయి.

అంతర్జాతీయ మార్కెట్లో
బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌కు 63 డాలర్లకు పడిపోయింది. అంతకుముందు 70 డాలర్ల నుండి ఈ స్థాయికి తగ్గింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు దాదాపు 24 రోజుల పాటు ధరలను స్థిరంగా ఉంచాయి. గతవారం రెండుసార్లు తగ్గించాయి. ఆ తర్వాత స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు మరోసారి తగ్గించాయి.ముడి చమురు ధరల్లో అస్థిరత్వం, ఎన్నికలు ధరల తగ్గుదలకు కారణం.
ఇటీవల కొద్ది రోజుల పాటు ధరలు ఫ్రీజ్ చేసినందున చమురు మార్కెటింగ్ కంపెనీలపై రూ.2.5 నుండి రూ.5 వరకు భారం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే బ్యారెల్ 70 డాలర్ల నుండి ఇప్పుడు పడిపోయినందున ఇప్పుడు ఆ నష్టాలను చమురు రంగ కంపెనీలు పూడ్చుకుంటాయని చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications