Petrol Prices: సామాన్యులపై యుద్ధం వేసిన బాంబు.. భగ్గుమంటున్న చమురు ధరలు..
Petrol Prices Today: ఇటీవల క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. మెున్నటి దాకా ఒపెక్ దేశాలు ఉత్పత్తిని తగ్గించటంతో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 100 డాలర్లకు చేరుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ మంటలు చల్లారేలోపు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం చమురు ధరల పెరుగుదలకు కారణంగా మారింది. యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు ఏకంగా 5 శాతం మేర పెరిగిపోయాయి. ఇది ఇప్పటికే అధిక ధరలు ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న ప్రపంచ ప్రజలపై సరికొత్త భారాన్ని మోపుతోంది. మూడిస్ వంటి బ్రోకరేజ్ సంస్థలు సైతం చమురు ధరలు పెరుగుతాయని ఇప్పటికే వెల్లడించాయి.

ఇదిలా ఉండగా భారత్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేందుకు ఎలాంటి అవకాశం కనిపించటం లేదు. దాదాపు 511 రోజులుగా దేశవ్యాప్తంగా ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన నగరాల్లో ధరలను రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు 96.72, డీజిల్ 89.62గా ఉన్నాయి. హైదరాబాదులో పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ రేటు రూ.97.82 వద్ద కొనసాగుతున్నాయి. ఇక ఏపీలోని విజయవాడలో నిన్నటి కంటే స్వలంగా రేట్లు పెరిగి లీటరు పెట్రోల్ ధర రూ.111.92 వద్ద, లీటర్ డీజిల్ రేటు రూ.99.65గా కొనసాగుతున్నాయి.
తాజాగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 4.02 శాతం పెరిగి 87.98 డాలర్లకు చేరుకోగా., డబ్ల్యూటీఐ బ్యారెల్‌కు 4.26 శాతం పెరిగి 86.32 డాలర్లకు చేరుకుంది. గడచిన మూడు నెలల కాలంలో చమురు ధరలు ఏకంగా 30 శాతం పెరిగాయి. ముడి చమురు ధరలు గత 13 నెలల రికార్డు గరిష్ఠాలకు చేరుకున్నాయి. అయితే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ భారతదేశంలోని ప్రధాన చమురు కంపెనీలు రేట్లను పెంచటం లేదు. ఎన్నికల సమయంలో సామాన్యులకు సెగ తెలియకుండా కేంద్రంలోని మోదీ సర్కార్ చూస్తున్న వేళ ప్రస్తుతానికి భారత ప్రజలకు పెరుగుతున్న ధరల నుంచి ఉపశమనం లభించిందని చెప్పుకోవాలి.


Click it and Unblock the Notifications