కరోనా మహమ్మారి - లాక్ డౌన్ కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలను రెండు నెలలకు పైగా సమీక్షించలేదు. క్రమంగా లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో చమురు ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల సమీక్ష ప్రారంభమైనప్పటి నుండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా ఐదు రోజుల పాటు వాహనదారులకు షాకిచ్చాయి.

నేడు రూ.60 పైసలు పెరుగుదల
నేడు (జూన్ 11, గురువారం) లీటర్ పెట్రోల్ పైన 60 పైసలు, డీజిల్ పైన 60 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు వెల్లడించాయి. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.73.40 నుండి రూ.74కు చేరుకుంది. లీటర్ డీజిల్ ధర రూ.71.62 నుండి రూ.72.22కి చేరుకుంది. దేశంలో ఆదివారం (7వ తేదీ) నుండి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి.

హైదరాబాద్ సహా ఈ నగరాల్లో ధరలు
ఈ ఐదు రోజుల్లో లీటర్ పెట్రోల్ పైన రూ.2.74 పైసలు, లీటర్ డీజిల్ పైన రూ.2.83 పైసలు పెరిగింది. అంటే దాదాపు రూ.3 వరకు పెరిగింది. వివిధ నగరాల్లో ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఢిల్లీలో రూ.74, రూ.72.22, ముంబైలో రూ.80.98, రూ.70.92, చెన్నైలో రూ.77.96, రూ.70.64, బెంగళూరులో రూ.76.39, రూ.68.66, హైదరాబాద్‌లో రూ.76.82, రూ.70.59 పెరిగింది.

ధరలు పెరుగుతాయని ముందే అంచనా
జూన్ నుండి పెట్రోల్ ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని గత నెలలోనే వార్తలు వచ్చాయి. పెట్రోల్ ధరలను ప్రతి రోజు సమీక్షిస్తారు. ఇందులో భాగంగా జూన్ నుండి లీటర్ పైన రూ.4 నుండి రూ.5 వరకు పెరిగే అవకాశముందని వార్తలు వచ్చాయి. ఐదు రోజుల్లోనే దాదాపు రూ.3 పెరిగింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications