వరుసగా రెండు రోజుల పాటు పెరిగిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. ఇటీవలి వరకు 10 రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ రూ.100 క్రాస్ చేయగా, నిన్నటి పెరుగుదలతో బీహార్ రాష్ట్రంలోను ఈ మార్కును దాటింది. దీంతో సెంచరీ దాటిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో బీహార్ 11వ రాష్ట్రంగా నిలిచింది. మే 4వ తేదీ నుండి చమురు ధరలు 31 రోజులు పెరిగాయి.
సెంచరీ దాటిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్నాటక, తెలంగాణ, ఒడిశా, మణిపూర్, జమ్ము కాశ్మీర్, లడక్, బీహార్ ఉన్నాయి. నిన్నటి పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.46గా ఉంది. డీజిల్ రూ.88.90గా నిలిచింది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.104.56, డీజిల్ రూ.96.42గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.98.30, డీజిల్ రూ.91.75గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.99.49, డీజిల్ రూ.93.46గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోను లీటర్ పెట్రోల్ ధర రూ.102 దాటింది.

పెట్రోల్, డీజిల్ ధరల్లో అరవై శాతానికి పైగా పన్నులు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ పైన రాజస్థాన్‌లో అత్యధిక వ్యాట్, ట్యాక్స్ ఉంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎక్కువ ట్యాక్స్ ఉంది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిన మొదటి ప్రాంతం. మిడ్ ఫిబ్రవరి నుండి నెలలో పెట్రోల్ ధర ఇక్కడ సెంచరీ దాటింది. నేడు లీటర్ పెట్రోల్ పైన 35 పైసలు, లీటర్ డీజిల్ పైన 25 పైసలు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.102.32, లీటర్ డీజిల్ రూ.96.90గా ఉంది.
More From GoodReturns

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications