Petrol Prices: దాదాపు ఏడాదిగా అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ ఇప్పటి వరకు దేశంలో కేంద్రం రేట్లు తగ్గించలేదు. దేశంలో 388వ రోజు సైతం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి.
చివరిగా మన దేశంలో ఇంధన ధరలను 21 మే 20200లో మోడీ సర్కార్ మార్పలు చేసింది. దీనికి ముందు మార్చి 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. దీంతో బ్యారెల్ ముడి చమురు ధర ఏకంగా రికార్డు స్థాయిలో 139 డాలర్లకు చేరుకుంది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ ధర దాదాపు 75 డాలర్ల వద్దకు చేరుకుంది. ఇంత భారీ తగ్గింపు వచ్చినప్పటికీ ఇండియాలో ప్రభుత్వం దానికి అనుగుణంగా తగ్గింపులను ప్రజలకు అందించటం లేదు.

దేశంలోని అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లోని నగరమైన పోర్ట్ బ్లెయిర్ లో చమురు ధరలు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.84.10 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.79.74గా ఉన్నాయి. అలాగే గరిష్ఠ ధరలు రాజస్థాన్ లో ఉన్నాయి. శ్రీగంగానగర్‌లో పెట్రోల్ ధర రూ.113.48, డీజిల్ ధర రూ.98.24 వద్ద కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం ధరలు అధికంగానే ఉన్నాయి.
అంతర్జాతీయంగా ఒకపక్క ధరలు తగ్గుతుంటే భారత ప్రభుత్వం మాత్రం ఎందుకు ఉపసమనం కల్పించటం లేదని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. అయితే దీనికి గల కారణాన్ని పరిశీలిస్తే.. ముడిచమురు ధరలు ఎక్కువగా ఉన్న సమయంలో భారత పెట్రోలియం కంపెనీలు లీటరు డీజిల్ పై రూ.27.7, పెట్రోల్ లీటరుపై రూ.17.4 చొప్పున నష్టపోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే.. జనవరి-మార్చి 2023 త్రైమాసికంలో పెట్రోల్‌పై చమురు కంపెనీలకు మార్జిన్ లీటరుకు రూ. 6.8కి తగ్గగా.. డీజిల్‌పై లీటరుకు రూ.0.5 సానుకూల మార్జిన్ వచ్చింది.
ఈ క్రమంలో తెలంగాణ, బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, జార్ఖండ్, సిక్కిం, ఒడిశా, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మణిపూర్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.100కు పైన విక్రయించబడుతోంది. ఇదే క్రమంలో ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో డీజిల్ ధర లీటరుకు రూ.100కు పైనే ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications