స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథం: మీ సిటీలో ధరను ఇలా తెలుసుకోవచ్చు
పెట్రోల్, డీజిల్ ధరల్లో మంగళవారం మార్పులేదు. సోమవారం ధరలు పెరిగి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్ లీటర్ రూ.100 క్రాస్ చేసింది. నిన్న పెట్రోల్ 29 పైసల నుండి 30 పైసలు, డీజిల్ 28 పైసల నుండి 30 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.41, లీటర్ డీజిల్ రూ.87.28, ముంబైలో పెట్రోల్ రూ.102.58, డీజిల్ రూ.94.70, చెన్నైలో పెట్రోల్ రూ.97.69, డీజిల్ రూ.91.92, కోల్‌కతాలో పెట్రోల్ రూ.96.34, డీజిల్ రూ.90.12గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.100.20, డీజిల్ రూ.95.14గా ఉంది.
మీ మీ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను ఎస్సెమ్మెస్ ద్వారా తెలుసుకోవచ్చు. దేశీయ చమురు రంగ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు సవరిస్తాయి. 9224992249కు సందేశం పంపించడం ద్వారా పెట్రోల్, డీజిల్ ధరలను ఎవరైనా తెలుసుకోవచ్చు. RSP Petrol Pump Dealer Code ను పై నెంబర్‌కు పంపించాలి. మీ సమీప పెట్రోల్ పంప్ అఫీషిలయ్ సైట్‌లోకి వెళ్లి ఆర్ఎస్‌పీ నెంబర్ తెలుసుకోవచ్చు.

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర చమురు శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఇబ్బందికరమేనని, అయితే కరోనా వ్యాక్సినేషన్ పైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదికి దాదాపు రూ.35,000 కోట్లు ఖర్చు చేస్తున్నాయని, ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో సంక్షేమ పథకాలపై ఖర్చుల కోసం డబ్బులు సేవింగ్ చేయవలసి వస్తోందన్నారు.


Click it and Unblock the Notifications