హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు దేశ రాజధాని ఢిల్లీలో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. గురువారం చమురు రంగ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా పెంచాయి. నేడు పెట్రోల్ లీటర్ పైన 35 పైసలు పెరిగి రూ.86.65 కాగా, డీజీల్ ధర 35 పైసలు పెరిగి రూ.76.83కు చేరుకుంది. 2021 బడ్జెట్ అనంతరం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి మళ్లీ షాక్ ఇస్తున్నాయి.
బడ్జెట్‌లో ఇంధనంపై అగ్రి సెస్ విధించిన అనంతరం పెట్రోల ధరలు చర్చనీయాంశంగా మారాయి. ధరలు పెరుగుతాయనే వాదనలపై స్పందించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అగ్రి సెస్ ప్రభావం కస్టమర్లపై పడదని చెప్పారు. అయితే అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో ఈ ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై పడింది.

వివిధ నగరాల్లో ధరలు
ధరల పెరుగుదల అనంతరం ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.93.20, డీజిల్ రూ.83.67కు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.88.01, చెన్నైలో 89.13గా ఉంది. డీజిల్ ధరలు కోల్‌కతాలో రూ.80.42, చెన్నైలో రూ.82.04గా ఉంది. ఢిల్లీలో పెట్రోల్ రూ.86.65, డీజిల్ రూ.రూ.76.83కు పెరిగింది. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ రూ.90.10, డీజిల్ రూ.83.81, అమరావతిలో పెట్రోల్ రూ.92.78, డీజిల్ రూ.85.99గా ఉంది.

ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు, అగ్రిసెస్ భారం
పెట్రోల్, డీజిల్ పైన బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీలను తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అదే సమయంలో కస్టమర్లపై అగ్రి సెస్ విధించారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు, అగ్రిసెస్ భారం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల అదనపు భారంపడదని ఆర్థికమంత్రి తెలిపారు. బడ్జెట్‌లో పెట్రోల్ పైన రూ.2.50, డీజిల్ మీద రూ.4 చొప్పున అగ్రి ఇన్ఫ్రా సెస్ విధించారు.

11వ సారి జంప్
దేశీయ చమురు రంగ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్(IOC), భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(BPCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(HPCL)లు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రతి రోజు ఉదయం ఆరుగంటలకు సవరిస్తాయి. 2021లో జనవరి 6న చమురురంగ ధరలు మొదటిసారి పెరిగాయి. 2021లో పెట్రోల్ ధరలు 11వ సారి పెరిగాయి. ఈ ఏడాది పెట్రోల్ ధరలు రూ.2.94, డీజిల్ ధరలు రూ.2.96 పెరిగింది.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications