ఐదు రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. మంగళవారం నుండి పెరుగుతున్న ధరలు నేడు (శుక్రవారం మే 7) కూడా స్వల్పంగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ పైన 28 పైసలు, డీజిల్ పైన 31 పైసలు పెరిగింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయ చమురురంగ కంపెనీలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరల్ని సవరిస్తాయి. తాజా సవరణ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ 28 పైసలు పెరిగి రూ.91.27, లీటర్ డీజిల్ 31 పైసలు పెరిగి రూ.81.73 వద్ద ట్రేడ్ అయింది.
ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.97.61, లీటర్ డీజిల్ రూ.88.82, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.93.15, లీటర్ డీజిల్ రూ.86.65, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.91.41, లీటర్ డీజిల్ రూ.84.57గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.94.68, లీటర్ డీజిల్ రూ.89.11గాఉంది. ఈ నాలుగు రోజుల్లో పెట్రోల్ లీటర్‌కు 87 పైసలు, డీజిల్ రూ.1 పెరిగింది.

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పైన కేంద్ర పన్నులు రూ.32.98 కాగా, రాష్ట్ర ప్రభుత్వ సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ రూ.19.55గా ఉంది. డీజిల్ విషయానికి వస్తే లీటర్ పైన ఎక్సైంజ్ డ్యూటీ రూ.31.83 కాగా, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రూ.10.99గా ఉంది. వీటతో పాటు డీలర్ కమిషన్ పెట్రోల్ పైన రూ.2.6, డీజిల్ పైన రూ.2గా ఉంది.
More From GoodReturns

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications