దేశంలో వరుసగా 12వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. గురువారం (జూన్ 18వ తేదీ) లీటర్ పెట్రోల్ పైన 53 పైసలు, లీటర్ డీజిల్ పైన 64 పైసలు పెరిగింది. ఈ రోజు పెరుగుదలతో ఈ పన్నెండు రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.6.55, లీటర్ డీజిల్ ధర రూ.7.04 పెరిగింది. కరోనా - లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల పాటు ధరలను సమీక్షించలేదు. జూన్ 7వ తేదీ నుండి సమీక్షిస్తున్న కంపెనీలు ప్రతి రోజు పెంచుతున్నాయి.

పెంపుతో ఎంత ఆదాయం వస్తుందంటే
తాజా పెంపుతో ఢిల్లీలో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.77.81, డీజిల్ రూ.76.43కు చేరుకుంది. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు అదనంగాకలవడంతో ధరల్లో రాష్ట్రాన్ని బట్టి స్వల్ప తేడా ఉంటుంది. ప్రభుత్వం మార్చిలో పెట్రోల్, డీజిల్ పైన రూ.3 ఎక్సైజ్ డ్యూటీ, మే నెలలో లీటర్ పెట్రోల్ పైన రూ.10, లీటర్ డీజిల్ పైన రూ.13 పెంచింది. దీంతో ధరలు పెరిగి, కేంద్రానికి అదనంగా రూ.2 లక్షల కోట్ల నుండి రూ.2.50 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. మరికొన్ని సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.4 లక్షల కోట్ల నుండి రూ.1.75 లక్షల కోట్ల వరకు మాత్రమే అదనంగా వస్తుందని చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎంత ధర అంటే
ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.84.66, డీజిల్ రూ.75, జైపూర్‌లో పెట్రోల్ రూ.84.79, డీజిల్ రూ.77, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పాట్నాలలో పెట్రోల్ రూ.80కి పైకి చేరుకుంది. కోల్‌కతా, నోయిడాలో రూ.80 మార్క్ చేరుకుంది. డీజిల్ హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.80.77, డీజిల్ రూ.74.70కి చేరుకుంది. అమరావతిలో పెట్రోల్ రూ.81.19, డీజిల్ రూ.75.14కు చేరుకుంది. విజయవాడలో పెట్రోల్ రూ.80.80, డీజిల్ రూ.74.77కు చేరుకుంది. జైపూర్‌లో అత్యధికంగా లీటర్ పెట్రోల్ రూ.84.79 ఉంది.

పెరుగుతున్న ఇంధన డిమాండ్
మార్చి చివరి వారం నుండి లాక్ డౌన్ కారణంగా ఇంధన ఉత్పత్తి పడిపోయింది. దీంతో ఏప్రిల్ నెలలో 4.22 మిలియన్ మెట్రిక్ టన్నులు (MMT) పెట్రోల్, డీజిల్ డిమాండ్ ఉండగా, మార్చి నెలలో ఇది 7.8 MMTగా ఉంది. మే నెల నాటికి క్రమంగా పెరిగింది. ఇది 7.26MMTకు చేరుకుంది. అసలు రూ.1.55 లక్షల కోట్ల అదనపు ఆదాయం లక్ష్యంగా ఎక్సైజ్ సుంకం పెంచారని చెబుతున్నారు. సాధారణంగా పెట్రోల్ పైన రూ.1 పెంచితే రూ.14,000 కోట్లు రెవెన్యూ అదనంగా వస్తుంది. ఇప్పడు దీంతో రూ.1.75 లక్షల కోట్ల నుండి రూ.2 లక్షల కోట్లకు పైగా వరకు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications