Petrol Price Today: 4 రోజుల్లో మూడుసార్లు పెరిగిన పెట్రోల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు నేడు(మార్చి 25, శుక్రవారం) పెరిగాయి. వరుసగా రెండు రోజుల పెరుగుదల తర్వాత నిన్న స్థిరంగా ఉన్న ధరలు, నేడు మళ్లీ 80 పైసలు పెరిగింది. ఈ నాలుగు రోజుల్లో మూడుసార్లు కూడా 80 పైసల చొప్పున పెరిగాయి. నవంబర్ 4, 2021 తర్వాత మార్చి 22వ తేదీన మొదటిసారి పెరిగిన ధరలు నిన్న మరోసారి పెరిగాయి. నేడు మాత్రం స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఇటీవల భారీగా పెరిగి, ఆ తర్వాత కాస్త శాంతించాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లుగా కనిపించడంతో ధరలు కాస్త క్షీణించాయి. అయినప్పటికీ నాలుగు నెలల క్రితం ధరతో పోలిస్తే దాదాపు 30 డాలర్లు పెరిగింది. దీపావళి తర్వాత మన వద్ద ధరలు పెరగలేదు. ఎన్నికలు, ఎన్నికల ఫలితాల తర్వాత పెరుగుతాయని భావించినప్పటికీ పెరగలేదు. దీపావళికి ముందు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ 70 డాలర్లకు కాస్త పైన ఉంది. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో 130 డాలర్లు దాటినప్పటికీ, ప్రస్తుతం కాస్త తగ్గి 110 డాలర్ల వద్ద ఉంది. నాలుగు నెలల్లో దాదాపు 30 డాలర్లు పెరగడంతో ధరలు పెరుగుతాయనే అంచనాలు మొదటి నుండి ఉన్నాయి. కానీ చాలా ఆలస్యంగా పెరిగాయి.

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (మార్చి 25, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. మూడు నెలలకు పైగా ధరల్లో మార్పులేదు. నాలుగు రోజుల నుండి పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉంటుంది. ఓ వైపు అంతర్జాతీయంగా ధరలు పెరిగాయి. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి.

Petrol, diesel prices hiked by 80 paise, third increase in four days

చాలా రోజులుగా మన వద్ద స్థిరంగా ఉండి ఇప్పుడిప్పుడే పెరుగుతున్నప్పటికీ, పలు ఇతర దేశాల్లో ఇప్పటికే ధరలు భారీగా పెరిగాయి. పాకిస్తాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు కొద్ది రోజుల క్రితం భారీగా పెరిగాయి. అక్కడి ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై ధరలను రూ.10 నుండి రూ.12 వరకు పెంచింది. దీంతో ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర కొన్ని ప్రాంతాల్లో రూ.160కి చేరుకుంది. మనవద్ద మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక శ్రీలంకలో అయితే లీటర్ పెట్రోల్ రూ.207కు చేరుకుంది.

తాజా పెరుగుదల అనంతరం ఢిల్లీలో పెట్రోల్ రూ.97.81, ముంబైలో రూ.112.51, డీజిల్ రూ.96.70, కోల్‌కతాలో పెట్రోల్ రూ.107.18, చెన్నైలో పెట్రోల్ రూ.103.67గా ఉంది. ఢిల్లీలో లీటర్ డీజిల్ రూ.88.27గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.111కు చేరువైంది, డీజిల్ రూ.97 వద్ద ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+