పెట్రోల్, డీజిల్ ధరలు నేడు(ఏప్రిల్ 4, సోమవారం) మళ్లీ పెరిగాయి. నవంబర్ 4, 2021 తర్వాత స్థిరంగా ఉన్న ధరలు మార్చి 22వ తేదీ నుండి పెరుగుతున్నాయి. ఈ పద్నాలుగు రోజుల్లో రెండు రోజులు మాత్రం స్థిరంగా ఉన్నాయి. దాదాపు ప్రతిరోజు 80 పైసల చొప్పున పెరిగింది. తాజా పెరుగుదలతో ఢిల్లీలో పెట్రోల్ రూ.104కు చేరువైంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.103.41, డీజిల్ రూ.94.67గా ఉంది. మార్చి 22వ తేదీ నుండి ఈ పద్నాలుగు రోజుల్లో పెట్రోల్ పైన రూ.8.40 పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.117.23కు చేరగా, డీజిల్ రూ.103.32కి చేరుకుంది. జెట్ ఫ్యూయల్ ధర ఈ నెల ప్రారంభంలో రెండు శాతం పెరిగి కిలో లీటర్‌కు రూ.1,12,924.83 కు చేరుకున్న విషయం తెలిసిందే.
అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఇటీవల భారీగా పెరిగి, ఆ తర్వాత కాస్త శాంతించాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లుగా కనిపించడంతో ధరలు కాస్త క్షీణించాయి. అయినప్పటికీ నాలుగు నెలల క్రితం ధరతో పోలిస్తే దాదాపు 30 డాలర్లు పెరిగింది. దీపావళి తర్వాత మన వద్ద ధరలు పెరగలేదు. ఎన్నికలు, ఎన్నికల ఫలితాల తర్వాత పెరుగుతాయని భావించినప్పటికీ పెరగలేదు. దీపావళికి ముందు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ 70 డాలర్లకు కాస్త పైన ఉంది. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో 130 డాలర్లు దాటినప్పటికీ, ప్రస్తుతం కాస్త తగ్గి 110 డాలర్ల వద్ద ఉంది. నాలుగు నెలల్లో దాదాపు 30 డాలర్లు పెరగడంతో ధరలు పెరుగుతాయనే అంచనాలు మొదటి నుండి ఉన్నాయి. కానీ చాలా ఆలస్యంగా పెరిగాయి.

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (ఏప్రిల్ 4, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications