Petrol, diesel prices: హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.117, అక్కడ రూ.122

పెట్రోల్, డీజిల్ ధరలు నేడు(ఏప్రిల్ 5, మంగళవారం) మళ్లీ పెరిగాయి. నవంబర్ 4, 2021 తర్వాత స్థిరంగా ఉన్న ధరలు మార్చి 22వ తేదీ నుండి పెరుగుతున్నాయి. ఈ పదిహేను రోజుల్లో రెండు రోజులు మాత్రం స్థిరంగా ఉన్నాయి. దాదాపు ప్రతిరోజు 80 పైసల చొప్పున పెరిగింది. తాజా పెరుగుదలతో ఢిల్లీలో పెట్రోల్ రూ.104.61కు చేరుకుంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.104.61, డీజిల్ రూ.95.87గా ఉంది. మార్చి 22వ తేదీ నుండి ఈ పద్నాలుగు రోజుల్లో పెట్రోల్ పైన రూ.9.40 పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.117.68కు చేరగా, డీజిల్ రూ.103.75కి చేరుకుంది. మహారాష్ట్రలోని పర్‌బనిలో పెట్రోల్ ధర లీటర్ పైన రూ.122.1కి చేరుకుంది. డీజిల్ రూ.104.62 వద్ద ఉంది. దేశంలో ఇది గరిష్టం. జెట్ ఫ్యూయల్ ధర ఈ నెల ప్రారంభంలో రెండు శాతం పెరిగి కిలో లీటర్‌కు రూ.1,12,924.83 కు చేరుకున్న విషయం తెలిసిందే.

అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఇటీవల భారీగా పెరిగి, ఆ తర్వాత కాస్త శాంతించాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లుగా కనిపించడంతో ధరలు కాస్త క్షీణించాయి. అయినప్పటికీ నాలుగు నెలల క్రితం ధరతో పోలిస్తే దాదాపు 30 డాలర్లు పెరిగింది. దీపావళి తర్వాత మన వద్ద ధరలు పెరగలేదు. ఎన్నికలు, ఎన్నికల ఫలితాల తర్వాత పెరుగుతాయని భావించినప్పటికీ పెరగలేదు. దీపావళికి ముందు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ 70 డాలర్లకు కాస్త పైన ఉంది. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో 130 డాలర్లు దాటినప్పటికీ, ప్రస్తుతం కాస్త తగ్గి 110 డాలర్ల వద్ద ఉంది. నాలుగు నెలల్లో దాదాపు 30 డాలర్లు పెరగడంతో ధరలు పెరుగుతాయనే అంచనాలు మొదటి నుండి ఉన్నాయి. కానీ చాలా ఆలస్యంగా పెరిగాయి.

Petrol, diesel prices hiked again today, 13th hike in 15 days

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (ఏప్రిల్ 5, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+