మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..కేవలం 8 రోజుల్లోనే మూడోసారి పెంపు.. ఈ సారి ఎంతంటే..

ఇకపై మీ వాహనాలపై ప్రయాణం మరింత భారం కానుంది. దేశంలో ఇంధన ధరల పెరుగుదల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (క్రూడ్ ఆయిల్) ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో, దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. ఈ నెలలో (మే 2026) ఇంధన ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం, అది కూడా కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలోనే మూడు సార్లు ధరలను సవరించారు.

తాజా సవరణ ప్రకారం.. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర లీటరుకు 87 పైసలు, డీజిల్ ధర లీటరుకు 91 పైసలు పెరిగింది. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹99.51 కి చేరగా, డీజిల్ ధర రూ. 92.49 కి చేరుకుంది. ఈ నెలలో అంతకుముందు ప్రభుత్వం, చమురు సంస్థలు లీటరుకు ఏకంగా రూ. 3 భారీ పెంపుతో ఇంధన ధరల పెరుగుదలకు శ్రీకారం చుట్టాయి. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం లేదా స్థిరత్వం తర్వాత వచ్చిన ఈ భారీ పెంపు వినియోగదారులకు గట్టి షాక్ ఇచ్చింది.

petrol price hike diesel price increase fuel prices today crude oil prices petrol diesel rates India fuel inflation oil price surge petrol diesel news India fuel prices rising crude oil costs fuel rate hike petrol diesel latest update oil market rally fuel cost increase global crude prices petrol diesel third hike fuel burden on consumers fuel inflation India energy prices petrol diesel trends

ఆ తర్వాత కొద్ది రోజులకే రెండోసారి లీటరుకు మరో 90 పైసలు పెంచారు. ఇప్పుడు తాజాగా శనివారం మూడోసారి ధరలను పెంచడంతో సామాన్యుడి జేబుకు పెద్ద చిల్లు పడుతోంది. కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) సీఎన్‌జీ (CNG) ధరలను కూడా కిలోకు ₹1 చొప్పున పెంచింది. గడిచిన 10 రోజుల్లో సీఎన్‌జీ ధరలు పెరగడం కూడా ఇది మూడోసారి.

Also Read

ప్రధానంగా పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు ఇరాన్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతర్జాతీయంగా బెంచ్ మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 104 డాలర్ల మార్కును దాటాయి. భారతదేశం తన మొత్తం ముడిచమురు అవసరాలలో దాదాపు 85 శాతం నుండి 90 శాతం వరకు ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల గ్లోబల్ మార్కెట్‌లో జరిగే స్వల్ప మార్పుల ప్రభావం కూడా దేశీయ ఇంధన ధరలపై నేరుగా పడుతుంది. గత రెండేళ్లుగా రష్యా నుండి లభించిన రాయితీ చమురు భారత్‌కు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా చమురు ధరలు పెరగక తప్పడం లేదు.

చమురు విక్రయ కంపెనీలైన ఐఓసీ (IOC), బీపీసీఎల్ (BPCL), హెచ్‌పీసీఎల్ (HPCL) గత కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నప్పటికీ దేశీయంగా రేట్లను స్థిరంగా ఉంచాయి. దీనివల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నెలకు దాదాపు రూ. 1,000 కోట్ల వరకు నష్టాలను భరించాల్సి వచ్చింది. బీపీసీఎల్ నివేదిక ప్రకారం.. కంపెనీలు డీజిల్ పైన లీటరుకు రూ. 25 నుండి రూ. 30 వరకు, పెట్రోల్ పైన లీటరుకు రూ. 10 నుండి రూ. 14 వరకు నష్టాలతో విక్రయించాయి. దీనికి భిన్నంగా ప్రైవేట్ రిటైలర్ అయిన 'షెల్ ఇండియా' అప్పటికే లీటర్ పెట్రోల్‌ను రూ. 115 పైగా, డీజిల్‌ను రూ. 126 పైగా విక్రయిస్తోంది. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి చమురు సంస్థలు ఇప్పుడు విడతల వారీగా ధరలను పెంచుకుంటూ పోతున్నాయి.

వరుస ధరల పెంపుతో దేశంలోని ప్రముఖ నగరాలైన ముంబై, కోల్‌కతా, చెన్నైలలో ఇంధన ధరలు మళ్లీ రూ. 100 మార్కును దాటి దూసుకుపోతున్నాయి. ముంబైలో పెట్రోల్ రూ.108.49, కోల్‌కతాలో రూ. 110.64 కి చేరింది. డీజిల్ ధరల పెంపు వల్ల రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయని ఎకనామిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇది దేశంలో ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే అవకాశం ఉంది.

ఈ క్రమంలో ఇంధన కొరత వస్తుందనే భయంతో పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు క్యూ కట్టారు. అయితే, కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. దేశంలో తగినంత పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని, ప్రజలు భయాందోళనలతో అవసరానికి మించి కొనుగోళ్లు (Panic Buying) చేయవద్దని, ఇంధన సరఫరా సజావుగా సాగడానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+