న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు మళ్లీ..మళ్లీ వాహనదారులపై భారాన్ని మోపుతూనే వస్తోన్నాయి..దండయాత్ర సాగిస్తోన్నాయి. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందుల పాలైన కోట్లాది కుటుంబాలపై అదనపు భారం పడుతూనే ఉంది. ఏ మాత్రం కనికరం చూపట్లేదు ఆయిల్ కంపెనీలు. ఈ పెంపుదలలో కూడా కొత్త పుంతలను తొక్కుతోన్నాయి చమురు కంపెనీలు. రోజువారీ పెట్రోల్ రేట్ల పెంపుదల మొత్తాన్ని పైసా పైసా అధికం చేస్తోన్నాయి.
పెట్రో రేట్ల పెంపుదలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలు నిరసన ప్రదర్శనలకు దిగుతోన్నప్పటికీ చమురు కంపెనీలు వాటిని ఏ మాత్రం పట్టించుకోవట్లేదనేది రోజువారీ పెంపుదలతో స్పష్టమౌతోంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 26 పైసల మేర పెంపుదల కనిపించింది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ.100.91 పైసలకు చేరింది. డీజిల్ 89.88 పైసలుగా నమోదైంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రేటు 106 రూపాయలను దాటింది. లీటర్ ఒక్కింటికి రూ.106.93 పైసలు పలుకుతోంది. అక్కడ డీజిల్ ధర 97.46. చెన్నైలో పెట్రోల్ రూ.101.67, డీజిల్ ధర రూ.94.39 పైసలుగా నమోదైంది. తాజా పెంపుతో కోల్‌కతలో పెట్రోల్ ధర రూ.101.01 పైసలుగా నమోదైంది. డీజిల్ ధర రూ.92.97గా ఉంటోంది. బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.104.29, డీజిల్ రూ.95.26 పైసలు, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.104.86, డీజిల్ రూ.97.96 పైసలు పలుకుతోంది.
భోపాల్‌లో పెట్రోల్ రూ.109.24 పైసలు, డీజిల్ రూ.98.67 పైసలుగా రికార్డయింది. పాట్నాలో పెట్రోల్ రూ.103.69 పైసలు, డీజిల్ రూ.95.94, లక్నోలో పెట్రోల్ రూ.98.02 పైసలు, డీజిల్ రూ.90.28 పైసలకు చేరింది. లక్నో వంటి ఒకట్రెండు నగరాలు మినహా దాదాపు అన్నీ వంద రూపాయలకు పైగా చేరాయి. తిరువనంతపురంలో పెట్రోల్ రూ.102.89 పైసలు, డీజిల్ రూ.96.47 పైసలు, జైపూర్‌లో పెట్రోల్ రూ.107.74 పైసలు, డీజిల్ రూ.99.02 పైసలు, చండీగఢ్‌లో పెట్రోల్ రూ.97.04 పైసలు, డీజిల్ రూ.89.51, భువనేశ్వర్‌లో పెట్రోల్ రూ.101.37, డీజిల్ రూ.97.67 పైసలకు చేరింది.
More From GoodReturns

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

భారీగా పెరిగిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై టికెట్ ఛార్జీల మోత తప్పదిక..

Oil prices: ముదురుతున్న యుద్ధం! ఊహించని స్థాయిలో ఆయిల్ రేట్లు పెరగనున్నాయా?

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications