పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (మంగళవారం, జూన్ 22) మరోసారి పెరిగాయి. నిన్న ఒకరోజు ధరలు స్థిరంగా ఉన్న అనంతరం నేడు మళ్లీ పెరిగాయి. దీంతో సోమవారం రూ.97.22గా ఉన్న లీటర్ పెట్రోల్ రూ.97.50కి పెరిగింది. డీజిల్ ధరలు రూ.87.23 నుండి రూ.87.97కు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు భారత్ పెట్రోలియం కార్పోరేషన్, ఎస్సార్, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ ధరలను సవరిస్తాయి.
తాజా పెరుగుదలతో ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.103.63, లీటర్ డీజిల్ రూ.95.72గా ఉంది. తమిళనాడు, చెన్నైలలో లీటర్ పెట్రోల్ రూ.98.65, లీటర్ డీజిల్ రూ.92.83గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.97.38, లీటర్ డీజిల్ రూ.91.08గా ఉంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ధరలు వేర్వేరుగా ఉంటాయి. కేంద్రం పన్నుతో పాటు ఆయా రాష్ట్రాలు విధించే పన్నుల ఆధారంగా ధరల్లో మార్పులు ఉంటాయి.

మే 4వ తేదీ నుండి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు 28సార్లు పెరిగాయి. కేవలం మే నెలలోనే 17సార్లు పెరిగింది. మే 4వ తేదీ నుండి ఈ 49 రోజుల కాలంలో లీటర్ పెట్రోల్ పైన రూ.7కు పైగా పెరిగింది. డీజిల్ పైన రూ.7.50కు పైగా పెరిగింది. ముంబై, రత్నగిరి, పర్బానీ, ఔరంగాబాద్, జైసల్మేర్, గంగానగర్, ఇడోర్, భోపాల్, గ్వాలియర్, గుంటూరు, కాకినాడ, హైదరాబాద్, చిక్‌మగ్‌ళూరు, శివమొగ్గ, లెహ్ తదితర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ రూ.100 దాటింది.
More From GoodReturns

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications