ముంబైలో రూ.100కు మరింత దగ్గరగా పెట్రోల్, వివిధ నగరాల్లో ఇలా..
దేశీయ చమురురంగ కంపెనీలు ఇంధన ధరలను నేడు (మే 25, మంగళవారం) పెంచాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెంపు తప్పలేదు. లీటర్ పెట్రోల్ పైన 23 పైసలు, లీటర్ డీజిల్ పైన 25 పైసలు పెరిగింది. తాజా పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.93.44, లీటర్ డీజిల్ రూ.84.32కు చేరుకుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర సెంచరీకి కేవలం 30 పైసల దూరంలో ఉంది. డీజిల్ ధరలు రూ.92కు సమీపంలో ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ రూ.99.71, డీజిల్ రూ.91.57 వద్ద ఉంది.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.93.44, లీటర్ డీజిల్ రూ.84.32, కోల్‌కతాలో పెట్రోల్ రూ.93.49, డీజిల్ రూ.87.16, ముంబైలో పెట్రోల్ రూ.99.71, డీజిల్ రూ.91.57, చెన్నైలో పెట్రోల్ రూ.95.06, డీజిల్ రూ.89.11గా ఉంది.

పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. ఉదాహరణకు ఢిల్లీలో చూసుకుంటే మే 16న లీటర్ పెట్రోల్ రూ.92.88గా ఉంది. ట్యాక్స్ బ్రేక్ చూసుకుంటే లీటర్ పెట్రోల్ బేస్ ప్రైస్ రూ.34.19. రవాణా తదితర ఖర్చులు 0.36 పైసలు. డీలర్స్‌కు వేసే ఛార్జ్ (ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ మినహా) రూ.34.55. ఎక్సైజ్ డ్యూటీ రూ.32.90. డీలర్ కమిషనర్ (యావరేజ్) రూ.3.77. వ్యాట్ రూ.21.36. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ మే 16వ తేదీన రూ.83.22గా ఉంది. ట్యాక్స్ బ్రేక్ చూస్తే బేస్ ప్రైస్ రూ.36.32. రవాణా తదితర ఖర్చులు 0.33 పైసలు. డీలర్స్‌కు వేసే ఛార్జ్ (ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ మినహా) రూ.36.65. ఎక్సైజ్ డ్యూటీ రూ.31.80. డీలర్ కమిషనర్ (యావరేజ్) రూ.2.58. వ్యాట్ రూ.12.19.


Click it and Unblock the Notifications