రెండు రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (మే 10 సోమవారం) నేడు మళ్లీ పెరిగాయి. అంతకుముందు వరుసగా నాలుగు రోజుల పాటు ధరలు పెరిగాయి. నిన్న, మొన్న స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్ పైన నేడు 26 పైసలు, డీజిల్ పైన 33 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్ రూ.91.27 నుండి రూ.91.53కు, డీజిల్ రూ.82.06 నుండి రూ.81.73కి పెరిగింది.

వివిధ నగరాల్లో ధరలు
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.91.53, లీటర్ డీజిల్ రూ.82.06గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.97.86, డీజిల్ రూ.89.17, చెన్నైలో పెట్రోల్ రూ.93.38, డీజిల్ రూ.86.96, కోల్‌కతా 84.90 వద్ద ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పెట్రోల్ రూ.100 మార్కును దాటింది. తాజాగా మహారాష్ట్రలోని పర్బనిలో పెట్రోల్ లీటర్ పైన రూ.100.20కి చేరుకుంది. భోపాల్ నగరంలో రూ.99.55 వద్ద ఉంది. అంటే సెంచరీకి చేరువలో ఉంది. రాజస్తాన్ గంగానగర్ జిల్లాలో రూ.102.42, మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌లో రూ..102.2 వద్ద ఉంది.

రూ.1కి పైగా పెరిగిన ధరలు
ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు ఐదుసార్లు పెరిగాయి. గత వారం రోజుల్లోనే ఈ పెరుగుదల నమోదయింది. ఈ కాలంలో లీటర్ పెట్రోల్ పైన రూ.1.14 పైసలు, లీటర్ డీజిల్ పైన రూ.1.33గా ఉంది. మార్చి 24వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ మధ్య ధరలు స్థిరంగా ఉన్నాయి.

ఇంధన పన్నులు
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పైన కేంద్ర పన్నులు రూ.32.98 కాగా, రాష్ట్ర ప్రభుత్వ సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ రూ.19.55గా ఉంది. డీజిల్ విషయానికి వస్తే లీటర్ పైన ఎక్సైంజ్ డ్యూటీ రూ.31.83 కాగా, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రూ.10.99గా ఉంది. వీటతో పాటు డీలర్ కమిషన్ పెట్రోల్ పైన రూ.2.6, డీజిల్ పైన రూ.2గా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరలను బట్టి మారుతాయి. బ్రెంట్ క్రూడ్ ధర ప్రస్తుతం 70 డాలర్లకు సమీపంలో ఉంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications