పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం (జనవరి 6) పెరిగాయి. దాదాపు నెల రోజుల అనంతరం మళ్లీ ధరలు పెరిగాయి. నేడు లీటర్ పెట్రోల్ పైన 26 పైసలు, డీజిల్ పైన 25 పైసలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ చమురు ధరలు రెండు రోజులుగా పెరుగుతున్నాయి. ఈ ప్రభావం దేశీయ చమురు మార్కెట్ పైన పడింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురురంగ కంపెనీలు ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తాయి.

పలు నగరాల్లో రూ.85 క్రాస్
దేశ రాజధాని న్యూఢిల్లీలో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.83.97, డీజిల్ 74.12గా ఉంది. ఢిల్లీలో డిసెంబర్ 7వ తేదీ నుండి పెట్రోల్ రూ.83.71 వద్ద ఉంది. అంతకుముందు పెట్రోల్, డీజిల్ ధరలు డిసెంబర్ 7, 2020న పెరిగాయి. 2018 సెప్టెంబర్ గరిష్టాన్ని పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పాట్నా వంటి నగరాల్లో పెట్రోల్ ధరలు రూ.85 దాటాయి.

ఆల్ టైమ్ హైకి సమీపంలో
ముంబైలో పెట్రోల్ ధర 26 పైసలు పెరిగి రూ.90 దాటింది. డీజిల్ ధర 27 పైసలు పెరిగి రూ.80.78 వద్ద ఉంది. పెట్రోల్ ధర లీటర్ ఢిల్లీలో రూ.83.97, చెన్నైలో రూ86.75, కోల్‌కతాలో రూ.85.44 గా ఉంది. ఇక లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ.74.12, చెన్నైలో రూ79.46, కోల్‌కతాలో రూ.77.70 గా ఉంది. డిసెంబర్ 7వ తేదీకి ముందు చమురు ధరలు వరుసగా ఆరు రోజులు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర ఆల్ టైమ్ గరిష్టం (రూ.84)కు సమీపంలో ఉంది.

డాలర్ పెరిగితే... ఆయిల్ ఇంపోర్ట్ బిల్ జంప్
అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్, డబ్ల్యుటీఐ క్రూడ్ వరుసగా 53 బ్యారెల్స్, 50 బ్యారెల్స్‌కు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సగటున ఒక బ్యారెల్‌కు ఒక డాలర్ పెరిగితే, ఏడాదికి భారత్ ఇంపోర్ట్ బిల్ రూ.10,700 పెరుగుతుందని అంచనా. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా భారత చమురురంగ కంపెనీలు ప్రతి రోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications