పెట్రోల్, డీజిల్ ధరలు 18 రోజుల తర్వాత మళ్లీ స్వల్పంగా పెరిగాయి. మే 4, 2021 మంగళవారం రోజున దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.15 పైసలు పెరిగి రూ.90.40 నుండి రూ.90.55కు, లీటర్ డీజిల్ 18 పైసలు పెరిగి రూ.80.73 నుండి రూ.80.91కు పెరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకారం వివిధ నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.96.95, డీజిల్ రూ.87.98, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.92.55, లీటర్ డీజిల్ రూ.85.90, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.90.76, లీటర్ డీజిల్ రూ.83.78గా ఉంది.
ఇదివరకు వరుసగా నాలుగుసార్లు తగ్గుముఖం పట్టిన ఇంధన ధరల్లో పెరుగుదల నమోదయింది. చివరిసారి గత నెల 15వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. పద్దెనిమిది రోజుల విరామం తర్వాత రేట్లను సమీక్షించాయి భారత చమురురంగ కంపెనీలు. అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం ఇప్పుడు ధరలు పెరగడం గమనార్హం.

పెట్రోల్, డీజిల్ ధరలు 66 రోజుల తర్వాత పెరిగాయి. చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన పెరిగాయి. ఈ మధ్యకాలంలో అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధరలు తగ్గలేదనే అంచనాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ తొలిదశ ఎన్నికల ముందు అయిదు రోజుల వ్యవధిలో మూడుసార్లు ఇంధన ధరలను తగ్గించాయి చమురు సంస్థలు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications