నేడు స్థిరంగా, పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు: ఫ్యూయల్ ట్యాంక్ నింపుకోండి...

అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 100 డాలర్లు క్రాస్ చేసింది. WTI కూడా 110 డాలర్లు దాటింది. ఇది పదేళ్ల గరిష్టం. అంతర్జాతీయంగా పెరిగినప్పటికీ, నాలుగు నెలలుగా భారత్‌లో ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (మార్చి 06, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. అయితే ధరల్లో ఎలాంటి మార్పులేదు. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి. మూడు నెలలకు పైగా ధరల్లో మార్పులేదు.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉండనుంది. ఓ వైపు అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరుగుతున్నాయి. బడ్జెట్‌కు తర్వాత కూడా మన వద్ద స్థిరంగా ఉన్నాయి. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ధరలు పెరిగే అవకాశముంది.

గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. ఢిల్లీలోను అక్కడి ప్రభుత్వం వ్యాట్‍ను తగ్గించింది. వ్యాట్‌ను ముప్పై శాతం నుండి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర రూ.8 తగ్గింది. ఆ తర్వాత జార్ఖండ్ ప్రభుత్వం టూవీలర్స్‌కు లీటర్ పెట్రోల్ పైన రూ.25 తగ్గింపును అమలు చేసింది. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

Petrol Diesel prices have not changed even today on 6 March 2022

లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.95.41, చెన్నైలో రూ.101.40, కోల్‌కతాలో రూ.104.67, ముంబైలో రూ.109.98, హైదరాబాద్‌లో రూ.108.20, విశాఖపట్నంలో రూ.109.05గా ఉంది.లీటర్ డీజిల్ ఢిల్లీలో రూ.86.67, చెన్నైలో రూ.91.43, కోల్‌కతాలో రూ.89.79, ముంబైలో రూ.94.14, హైదరాబాద్‌లో రూ.94.62, విశాఖపట్నం రూ.95.18గా ఉంది.ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ అతి తక్కువగా దొరుకుతుంది పోర్ట్ బ్లెయిర్‌లో. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.82.96, లీటర్ డీజిల్ రూ.77.13గా ఉంది.
భువనేశ్వర్‌లో గత రెండు రోజుల్లో 29 పైసలు పెరిగింది.

పాకిస్తాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల భారీగా పెరిగాయి. పాక్ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై ధరలను రూ.10 నుండి రూ.12 వరకు పెంచింది. దీంతో ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర కొన్ని ప్రాంతాల్లో రూ.160కి చేరుకుంది. మనవద్ద మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఘట్టం ముగిసిన తర్వాత పెరుగుతాయి.

Petrol Diesel prices have not changed even today on 6 March 2022

అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. WTI క్రూడ్ 111.23 డాలర్లు, బ్రెంట్ క్రూడ్ 113.06 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు ఇటీవల పైపైకి చేరుకున్నాయి. క్రితం సెషన్‌లో ఓ సమయంలో 117 డాలర్లకు చేరుకుంది. 2014లో తొలిసారి బ్యారెల్ చమురు 100 డాలర్లకు చేరుకుంది. గత నాలుగు నెలలుగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. డిసెంబర్ నెలలో 10.22 శాతం, జనవరిలో 17 శాతం, ఫిబ్రవరిలో 10.7 శాతం పెరిగాయి. మార్చి నెలలోనే ఇప్పటి వరకు 16 శాతం పెరిగాయి.

అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల ప్రభావం భారత్ పైన ప్రభావం చూపుతుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తంతు 7న ముగియనుంది. ఆ తర్వాత ఎప్పుడైన పెట్రోల్, డీజిల్ ధరలు రూ.10 నుండి రూ.20 పెరిగే అవకాశముంది. అదే జరిగితే రవాణా ఖర్చులు పెరిగి, ఇతర ఛార్జీలు పెరుగుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ స్పందించారు. మీ వాహనాలలో ఫ్యూయల్ ట్యాంకులను ఇప్పుడే ఫిల్ చేసుకోండని సూచించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+