15 రోజుల తర్వాత మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు: ఢిల్లీలో ఎంత ఉందంటే
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. భారత చమురు రంగ కంపెనీలు పదిహేను రోజుల పాటు ధరలను సవరించలేదు. తాజాగా నేడు (ఏప్రిల్ 15, గురువారం) స్వల్పంగా తగ్గించాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు క్షీణిస్తున్నాయి. దీంతో దేశీయ చమురు రంగ కంపెనీలు కూడా నేడు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరించాయి.
దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు 16 పైసలు తగ్గి రూ.90.56 నుండి రూ.90.40కి, డీజిల్ లీటర్ 14 పైసలు తగ్గి రూ.80.87 నుండి రూ.83.73గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.96.83, లీటర్ డీజిల్ రూ.87.81గా ఉంది. పెట్రోల్, డీజిల్ పైన వివిధ రకాల ట్యాక్స్‌లు ఉంటాయి.

పదిహేను రోజుల తర్వాత నాలుగు ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఢిల్లీలో పెట్రోల్ రూ.90.40, డీజిల్ రూ.80.73, ముంబైలో పెట్రోల్ రూ.96.83, డీజిల్ రూ.87.81, చెన్నైలో పెట్రోల్ రూ.92.43, డీజిల్ రూ.85.75, కోల్‌కతాలో పెట్రోల్ రూ.90.62, డీజిల్ రూ.83.61గా ఉంది. భారత చమురు రంగ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం ధరలు తగ్గించాయి.
అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా చమురు రంగ కంపెనీలు ప్రతి రోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి. ఇటీవల బ్యారెల్ 70 డాలర్లు పలికిన చమురు, ప్రస్తుతం 66 డాలర్లకు క్షీణించింది. అంతకుముందు మార్చి 30వ తేదీన పెట్రోల్ పైన 22 పైసలు, డీజిల్ పైన 23 పైసలు తగ్గించాయి.


Click it and Unblock the Notifications