పెట్రోల్, డీజిల్ ధరలు గతవారం రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. నవంబర్ 4వ తేదీ నుండి స్థిరంగా ఉన్న ధరలు మార్చి 22వ తేదీ నుండి తిరిగి సవరిస్తున్నారు. దీంతో ఈ వారం వ్యవధిలో ధరలు రూ.4కు పైగా పెరిగింది. నేడు లీటర్ పెట్రోల్ పైన 80 పైసలు, డీజిల్ పైన 70 పైసలు పెరిగింది. నేటి పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.100 దాటింది.
ముంబై, హైదరాబాద్‌లలో వాహనదారులు పెట్రోల్ కొనుగోలు చేయాలంటే రూ.115 చెల్లించాలి. వారం రోజులుగా పెరుగుతున్న ధరలతో ప్రజలపై రూ.4కు పైగా భారం పడింది. మార్చి 22వ తేదీ నుండి ఇప్పటి వరకు వివిధ నగరాల్లో పెట్రోల్ పైన రూ.4.80 నుండి రూ.4.85 మధ్య, డీజిల్ పైన రూ.4.85 భారం పడింది.

వివిధ నగరాల్లో
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.100.21, డీజిల్ రూ.91.47, ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.115.04, డీజిల్ రూ.99.25, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.105.94, డీజిల్ రూ.96, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.109.68, డీజిల్ రూ.94.62, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.113.61, డీజిల్ రూ.99.84గా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు సవరిస్తారు. ఇది 2017లో ప్రారంభమైంది.

70 నుండి 110కి
క్రూడ్ ధరలు ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో 140 డాలర్లు దాటాయి. ఆ తర్వాత కాస్త శాంతించి 110 డాలర్లకు తగ్గాయి. అయినప్పటికీ నాలుగు నెలల క్రితం ధర 70 డాలర్ల వద్ద ఉన్న క్రూడ్ ఇప్పుడు 110 డాలర్ల వద్ద ఉంది. ఇటీవలి గరిష్టంతో పోలిస్తే తగ్గినప్పటికీ నాలుగు నెలల క్రితం ధరతో పోలిస్తే దాదాపు సగం పెరిగింది. సోమవారం నాటికి క్రూడ్ ధరలు దాదాపు 7 శాతం పడిపోయాయి.
ఇటీవల చమురు ధరలు కాస్త శాంతించినప్పటికీ మన వద్ద మాత్రం పెరుగుతున్నాయి. దానికి కారణం ఉంది. అమెరికా, శ్రీలంక, పాకిస్తాన్ సహా వివిధ దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే భారీగా పెరిగాయి. మన వద్ద ఇప్పుడు స్వల్పంగా పెరుగుతున్నాయి.

అందుకే ఇప్పుడు పెరుగుదల
మన దేశంలో నవంబర్ 4వ తేదీ నుండి పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులేదు. నాలుగు నెలలకు పైగా ధరలు పెరగలేదు. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు రెండింతలు అయ్యాయి. ఆ సమయంలో మన వద్ద ఎన్నికలు ఉన్న కారణంగా ధరలు పెరగలేదు.
లేదంటే ఇప్పటికే రూ.150 దాటాలి. మార్చి 10న ఫలితాల తర్వాత పెరుగుతాయని అందరూ భావించారు. కానీ అప్పుడు కూడా పెరగలేదు. ఆ తర్వాత పన్నెండు రోజులకు పెరిగాయి. నవంబర్ 4 నుండి పెరగకపోవడం, అప్పటి నుండి అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు 50 శాతం పెరగడం వల్ల ఇప్పుడు ధరలపై ప్రభావం పడుతుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications