Petrol, diesel price today: పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులేదు
పెట్రోల్, డీజిల్ ధరల్లో నేడు (మే 28 శుక్రవారం) మార్పులేదు. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు నిన్న స్వల్పంగా పెరిగాయి. దేశీయ చమురు మార్కెటింగ్ రంగ కంపెనీలు నేడు యథాతథంగా ఉంచాయి. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్‌కు రూ.93.68, డీజిల్ రూ.84.61గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.99.94, డీజిల్ రూ.91.87గా ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు రూ.100 దాటాయి.
పెట్రోల్ రూ.100 క్రాస్ చేసిన మొదటి రాజధాని భోపాల్. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వివిధ రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. ఆయా రాష్ట్రాల వ్యాట్ కారణంగా ధరల్లో మార్పు ఉంటుంది. రాజస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ ఉంది. అందుకే అక్కడ లీటర్ పెట్రోల్ పలు ప్రాంతాల్లో రూ.100 దాటింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోను ఎక్కువ వ్యాట్ ఉంది. అందుకే ఈ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ రూ.100 దాటింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ ట్యాక్స్‌ను వేయడం పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటానికి కారణం. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు రంగ కంపెనీలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా లాక్ డౌన్, కఠిన ఆంక్షలతో పెట్రోల్, డీజిల్ వినియోగం ఇటీవల తగ్గింది.


Click it and Unblock the Notifications