నిన్న పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (సోమవారం 24, మే) యథాతథంగా ఉన్నాయి. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరల్లో ఎలాంటి మార్పులేదు. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.21, లీటర్ డీజిల్ రూ.84.07గా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం స్వల్పంగా పెరిగాయి.
మెట్రో నగరాల్లో సరికొత్త రికార్డును తాకాయి. నిన్న లీటర్ పెట్రోల్ పైన 17 పైసలు, లీటర్ డీజిల్ పైన 29 పైసలు పెరిగింది. నిన్నటి పెరుగుదలతో ఈ నెలలో 12వ పెంపు. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.100కు సమీపంలో ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.99.49, డీజిల్ రూ.91.30గా ఉంది. దేశీయ చమురు రంగ కంపెనీలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రతిరోజు ఉదయం ఇంధన ధరలను సవరిస్తాయి.

పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. ఉదాహరణకు ఢిల్లీలో చూసుకుంటే మే 16న లీటర్ పెట్రోల్ రూ.92.88గా ఉంది. ట్యాక్స్ బ్రేక్ చూసుకుంటే లీటర్ పెట్రోల్ బేస్ ప్రైస్ రూ.34.19. రవాణా తదితర ఖర్చులు 0.36 పైసలు. డీలర్స్‌కు వేసే ఛార్జ్ (ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ మినహా) రూ.34.55. ఎక్సైజ్ డ్యూటీ రూ.32.90. డీలర్ కమిషనర్ (యావరేజ్) రూ.3.77. వ్యాట్ రూ.21.36. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ మే 16వ తేదీన రూ.83.22గా ఉంది. ట్యాక్స్ బ్రేక్ చూస్తే బేస్ ప్రైస్ రూ.36.32. రవాణా తదితర ఖర్చులు 0.33 పైసలు. డీలర్స్‌కు వేసే ఛార్జ్ (ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ మినహా) రూ.36.65. ఎక్సైజ్ డ్యూటీ రూ.31.80. డీలర్ కమిషనర్ (యావరేజ్) రూ.2.58. వ్యాట్ రూ.12.19.
వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధర
ముంబైలో పెట్రోల్ రూ.99.49, డీజిల్ రూ.91.30
కోల్‌కతాలో పెట్రోల్ రూ.93.27, డీజిల్ రూ.86.91
చెన్నైలో పెట్రోల్ రూ.94.86, డీజిల్ రూ.88.87
బెంగళూరులో పెట్రోల్ రూ.96.31, డీజిల్ రూ.89.12
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.96.88, డీజిల్ రూ.91.65
తిరువనంతపురంలో పెట్రోల్ రూ.95.19, డీజిల్ రూ.90.36
జైపూర్‌లో పెట్రోల్ రూ.99.68, డీజిల్ రూ.92.78
పాట్నాలో పెట్రోల్ రూ.96.19, డీజిల్ రూ.90.07
చండీగడ్‌లో పెట్రోల్ రూ.89.66, డీజిల్ రూ.83.73
More From GoodReturns

పెట్రోల్, డీజిల్ పన్ను తగ్గింపు.. 15 రోజుల్లో కేంద్రానికి రూ. 7 వేల కోట్లు నష్టం..

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

LPG సిలిండర్ల కొరత ఉందా? అసలు నిజం చెప్పిన ప్రభుత్వం.. సోషల్ మీడియా వార్తలను నమ్మకండి!

LPG: భారత్‌కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

ఇరాన్ యుద్ధం.. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు.. ఆర్థిక స్థిరత్వం కోసం ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications