పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథం: ఆ సిటీలో బంకుల ముందు క్యూ
పెట్రోల్, డీజిల్ ధరల్లో సోమవారం (మార్చి 29) ఎలాంటి మార్పులేదు. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.90.78, డీజిల్ లీటర్ ధర రూ.81.10గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.97.19, డీజిల్ రూ.88.20గా ఉంది. చమురు రంగ కంపెనీలు చివరిసారి మార్చి 25న సవరించాయి. మార్చి 24, 25 తేదీల్లో ధరలను స్వల్పంగా తగ్గించాయి. అంతకుముందు వరుసగా 24 రోజుల పాటు ధరల్లో మార్పులేదు.
పెట్రోల్ లీటర్ ధర ఢిల్లీలో రూ.90.78, ముంబైలో రూ.97.19, చెన్నైలో రూ.92.77, కోల్‌కతాలో రూ.90.98, డీజిల్ ధర ఢిల్లీలో రూ.81.10, ముంబైలో రూ.88.20, చెన్నైలో రూ.86.10, కోల్‌కతాలో రూ.83.98గా ఉంది. పెట్రోల్ ధరల్లో 60 శాతం వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, ట్యాక్స్‌లు ఉంటాయి. డీజిల్ ధరల్లో 54 శాతం ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.32.90, డీజిల్ పైన రూ.31.80 ఎక్సైజ్ డ్యూటీని వేస్తోంది. ఇందులో రాష్ట్రాలకు ఆదాయం వెళ్తుంది. మరోవైపు రాష్ట్రాలు అదనంగా పన్నులు వేస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర చివరి సెషన్లో 18 సెంట్లు తగ్గి 64.39 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. యూఎస్ క్రూడ్ 22 సెంట్లు తగ్గి 60.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇదిలా ఉండగా, ఔరంగాబాద్‌లో లాక్ డౌన్ భయాలతో ప్రజలు శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు పెట్రోల్ బంకుల ముందు వరుస కట్టాయి.


Click it and Unblock the Notifications