For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Petrol prices today: స్థిరంగా పెట్రోల్ ధర, నేపాల్‌లో ఆల్ టైమ్ గరిష్టానికి

|

పెట్రోల్, డీజిల్ ధరలు ఐదు వారాలకు పైగా స్థిరంగా ఉన్నాయి. సోమవారం, మే 16వ తేదీన ధరలో ఎలాంటి మార్పులేదు. చివరిసారి 6, ఏప్రిల్ రోజున లీటర్ పెట్రోల్ పైన 80 పైసలు పెరిగింది. మార్చి 22వ తేదీ నుండి పక్షం రోజుల పాటు మొత్తం రూ.10 వరకు పెరిగింది. ఆ తర్వాత స్థిరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41, లీటర్ డీజిల్ ధర రూ.96.67 వద్ద ఉంది. గురుగ్రామ్‌లో పెట్రోల్ రూ.105.86, డీజిల్ రూ.97.10గా ఉంది.

మార్చి 22వ తేదీ నుండి దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను సవరిస్తున్నాయి. నవంబర్ 4వ తేదీ నుండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. నాలుగున్నర నెలల పాటు స్థిరంగా ఉన్న ధరలు మార్చి 22వ తేదీ వరకు స్థిరంగానే కొనసాగాయి. ఆ తర్వాత పది రోజుల పాటు సవరించారు. తిరిగి స్థిరంగా కొనసాగుతున్నాయి.

స్థిరంగా పెట్రోల్ ధర, నేపాల్‌లో ఆల్ టైమ్ గరిష్టానికి

ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.120.51, డీజిల్ రూ.104.77, చెన్నైలో పెట్రోల్ రూ.110.85, డీజిల్ రూ.100.94, కోల్‌కతాలో పెట్రోల్ రూ.115.12, డీజిల్ రూ.99.83, బెంగళూరులో పెట్రోల్ రూ.111.09, డీజిల్ రూ.94.79గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.119.49, డీజిల్ రూ.105.49 వద్ద ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పలు ప్రాంతాల్లో సెంచరీని క్రాస్ చేశాయి. రాజస్థాన్‌లోని శ్రీ గంగాధరలో లీటర్ పెట్రోల్ రూ.123కు చేరుకుంది. ఇక్కడ డీజిల్ రూ.105.31గా ఉంది. బ్రెంట్ క్రూడ్ ధరలు 111 డాలర్ల వద్ద, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 110 డాలర్ల వద్ద ఉంది.

నేపాల్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. నేపాల్ ప్రభుత్వరంగపెట్రోలియం ఇంపోర్టర్ ఎన్ఓసీ లీటర్ పెట్రోల్ పైన 10 పైసలు పెంచాలని నిర్ణయించింది. దీంతో నేపాల్ కరెన్సీలో ఇది 170కి చేరుకుంది. డీజిల్ ధర నేపాల్ రూపాయిలో 152కు చేరుకుంది.

English summary

Petrol Diesel price: There is no change in the price on May 16, 2022

There has been no change in the price of petrol and diesel for more than a month till May 16, 2022.
Story first published: Monday, May 16, 2022, 7:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X