నేడు స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు: ఆల్‌టైం గరిష్టం తర్వాత యథాతథంగా..
పెట్రోల్, డీజల్ ధరలు శుక్రవారం(జూలై 16) స్థిరంగా ఉన్నాయి. వరుసగా రెండు రోజులు యథాతథంగా ఉన్న ధరలు, నిన్న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురురంగ కంపెనీలు ధరలను సవరిస్తాయి. నేడు ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్నటి పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.54, లీటర్ డీజిల్ రూ.89.87గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.107.54, లీటర్ డీజిల్ రూ.97.45గా ఉంది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.23, లీటర్ డీజిల్ రూ.94.39, కోల్‌తాలో పెట్రోల్ రూ.101.74, డీజిల్ రూ.93.02, భోపాల్‌లో పెట్రోల్ రూ.109.89, డీజిల్ రూ.98.67గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.105.52, డీజిల్ రూ.97.96, బెంగళూరులో పెట్రోల్ రూ.104.94, డీజిల్ రూ.95.26, తిరువనంతపురంలో పెట్రోల్ రూ.103.52, డీజిల్ రూ.96.47గా ఉంది.

పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్‌కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్ తదితర నగరాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 54 శాతం పన్నులు. కేంద్రం పెట్రోల్ పైన రూ.32.90, డీజిల్ పైన రూ.31.80 వేస్తుంది. ఇక ఆయా రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. దీంతో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు మారుతుంటాయి. రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ విధిస్తుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.


Click it and Unblock the Notifications