పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 17వ రోజు ఆదివారం(నవంబర్ 21) స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. కొద్ది రోజుల క్రితం మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి దీపావళికి శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి లీటర్ పెట్రోల్, డీజిల్ పైన రూ.7 చొప్పున తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. ధరలు తాము తగ్గించేది లేదని చెబుతున్నాయి.
కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపు పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 మాత్రమే వర్తిస్తోంది. కేంద్రం తగ్గింపుకు రాష్ట్రాల వ్యాట్ తగ్గింపు తోడు కావడంతో పెట్రోల్ పైన రూ.12, డీజిల్ పైన రూ.17 వరకు తగ్గింది. మందగమనం, కరోనా వంటి కఠిన పరిస్థితుల్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగి, ఇక్కడ కూడా ధరలు ఆకాశాన్ని అంటాయి. ధరలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో గత మూడేళ్లలో మొదటిసారి కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. దీంతో చాలాచోట్ల డీజిల్ ధరలు రూ.100 దిగువకు వచ్చాయి. పెట్రోల్ ధరలు కూడా కాస్త తగ్గాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు పలు నగరాల్లో రూ.100 దిగువకు వచ్చాయి. ఢిల్లీ (రూ.94.14), కోల్‌కతా (రూ.89.79), చెన్నై (రూ.91.43), భోపాల్ (రూ.90.87లలో డీజిల్ ధర రూ.100 లోపు ఉంది. కేంద్రం తగ్గింపు తర్వాత పలు రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయి. కానీ చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వ్యాట్ తగ్గించలేదు.
అంతర్జాతీయంగా ఇటీవల చమురు ధరలు క్షీణించాయి. చమురు సరఫరా సులభతరమవుతుందనే అంచనాల నేపథ్యంలో ధరలు క్షీణించాయి. దీనికి తోడు చైనా కూడా క్రూడ్ రిజర్వ్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. దీంతో చమురు ధరలు అంతర్జాతీయంగా ఓ సమయంలో ఆరు వారాల కనిష్టానికి చేరాయి. అయితే ఆ తర్వాత ధరలు మళ్లీ పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ నిన్న 96 సెంట్లు లేదా 1.2 శాతం క్షీణించి 81.24 డాలర్ల వద్ద ముగిసింది. నిన్నటి ట్రేడింగ్‌లో ఓ సమయంలో 79.28 డాలర్లకు పడిపోయింది. అక్టోబర్ 7వ తేదీ తర్వాత ఇదే కనిష్టం. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ ఫ్యూచర్స్ 65 సెంట్లు లేదా 0.8 శాతం క్షీణించి 79.01 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. వెస్ట్ టెక్సాస్ కూడా ఓ సమయంలో గత నెలరోజుల కనిష్టం 77.08 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అయింది.
More From GoodReturns

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications