For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Petrol, diesel prices: అక్కడ భారీగా పెరిగిన చమురు ధరలు, ఇక్కడ స్థిరంగా పెట్రోల్ ధర

|

పెట్రోల్, డీజిల్ ధరలు నేడు(ఫిబ్రవరి 4, 2022) స్థిరంగా ఉన్నాయి. చమురు మార్కెటింగ్ రంగ సంస్థలు ధరలను యథాస్థితిలో కొనసాగిస్తున్నాయి. మూడు నెలలుగా ధరల్లో దాదాపు మార్పులేదు. అయితే నేడు కొన్ని నగరాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉండనుంది. ఓ వైపు అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరుగుతున్నాయి. బడ్జెట్‌కు తర్వాత కూడా మన వద్ద స్థిరంగా ఉన్నాయి.

గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. ఢిల్లీలోను అక్కడి ప్రభుత్వం వ్యాట్‌‍ను తగ్గించింది. వ్యాట్‌ను ముప్పై శాతం నుండి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర రూ.8 తగ్గింది. ఆ తర్వాత జార్ఖండ్ ప్రభుత్వం టూవీలర్స్‌కు లీటర్ పెట్రోల్ పైన రూ.25 తగ్గింపును అమలు చేసింది. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

Petrol Diesel Price: IOCL released rates for 4 Feb 2022

లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.95.41, చెన్నైలో రూ.101.40, కోల్‌కతాలో రూ.104.67, ముంబైలో రూ.109.98, హైదరాబాద్‌లో రూ.108.20, విశాఖపట్నంలో రూ.109.05గా ఉంది.
లీటర్ డీజిల్ ఢిల్లీలో రూ.86.67, చెన్నైలో రూ.91.43, కోల్‌కతాలో రూ.89.79, ముంబైలో రూ.94.14, హైదరాబాద్‌లో రూ.94.62, విశాఖపట్నం రూ.95.18గా ఉంది.
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ అతి తక్కువగా దొరుకుతుంది పోర్ట్ బ్లెయిర్‌లో. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.82.96, లీటర్ డీజిల్ రూ.77.13గా ఉంది.భువనేశ్వర్‌లో గత రెండు రోజుల్లో 29 పైసలు పెరిగింది.

అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. WTI క్రూడ్ 90.72 డాలర్లు, బ్రెంట్ క్రూడ్ 91.47 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. డిమాండ్ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మార్చి నుండి సౌదీ అరేబియా ఉత్పత్తిని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పైపైకి చేరుతున్నాయి. త్వరలో ఫెడ్ రేట్లు పెరగనున్నాయనే అంశం ప్రభావం చమురుపై కనిపిస్తోంది. అయితే ఉద్రిక్తతల కారణంగా ధరలు పెరుగుతున్నాయి.

Petrol Diesel Price: IOCL released rates for 4 Feb 2022

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 2022 క్యాలెండర్ ఏడాది మూడో త్రైమాసికంలో బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని గోల్డ్ మన్ శాక్స్ అంచనా వేస్తోంది. ఒమిక్రాన్ కారణంగా డిమాండ్ తగ్గుతుందని భావించినప్పటికీ, ఇది పెరుగుతుందని పేర్కొంది. సరఫరా డిమాండ్, ఒపెక్ ప్లస్ దేశాల ఉత్పత్తి క్షీణత ప్రభావంతో ధరలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తోంది. అదే జరిగితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి మండిపోయే అవకాశముంది.

English summary

Petrol, diesel prices: అక్కడ భారీగా పెరిగిన చమురు ధరలు, ఇక్కడ స్థిరంగా పెట్రోల్ ధర | Petrol Diesel Price: IOCL released rates for 4 Feb 2022

Today’s latest rates of petrol and diesel have been released. Let us tell you that the state-owned oil companies IOCL have not made any change in the price of petrol and diesel even today. Petrol is being sold at Rs 95.41 per liter and diesel at Rs 86.67 per liter in the national capital today.
Story first published: Friday, February 4, 2022, 7:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X