రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే ఈ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే మన వద్ద ఎన్నికల కారణంగా ధరలు గత నాలుగు నెలలుగా స్థిరంగా ఉన్నాయి. అయితే ఎన్నికల అనంతరం ప్రజలపై పెట్రో భారం తప్పేలా లేదు. ఇందుకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ నాలుగు నెలల కాలంలో చమురు ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి. 70 నుండి 75 డాలర్ల స్థాయిలో ఉన్న క్రూడ్ ధరలు ఇప్పుడు 110 డాలర్లు క్రాస్ చేశాయి. అంటే ఈ కాలంలో ధరలు రూ.100 నుండి రూ.150కి పెరిగినట్లుగా భావించాలి. అందుకే పాకిస్తాన్‌లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.160 క్రాస్ చేసింది. ఇక్కడ వచ్చే వారంనాటికి ఎన్నికల తంతు ముగుస్తుంది. అందుకే ధరలు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

కేంద్రం కాస్త అండ
కరోనా థర్డ్ వేవ్ కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు గతంలోను భారీగా పెరిగాయి. దీంతో సామాన్యులపై భారం తగ్గించేందుకు కేంద్రం పెట్రోల్, డీజిల్ పైన సెస్‌ను తగ్గించింది. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. కేంద్రం అనంతరం వివిధ రాష్ట్రాలు కూడా అదే బాటలో నడిచాయి. అయితే ఈ నాలుగు నెలల కాలంలో చమురు ధరలు 70 డాలర్ల నుండి 110 డాలర్లకు పెరగడంతో ధరలు మండిపోవాల్సిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ఇందులో కొంత భారం మోసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. మోడీ ప్రభుత్వం రూ.1 నుండి రూ.3 వరకు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించవచ్చు. అప్పుడు సామాన్యుడిపై భారం కాస్త తగ్గవచ్చునని అంటున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సరఫరా ఇబ్బందులు, ఉత్పత్తి వంటి అంశాలు ప్రభావం చూపి, ధరలు పెరుగుతున్నాయి.

ఏడేళ్ల గరిష్టానికి
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ 110 డాలర్లు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 108 డాలర్లు దాటింది. 2014 నవంబర్ తర్వాత ఇదే గరిష్టం. మార్చి 1వ తేదీ నుండి భారత్ కొనుగోలు చేస్తున్న ముడి చమురు బ్యారెల్ ధర 102 డాలర్లకు చేరుకున్నదని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఒక్కో లీటర్ పైన రూ.5 నుండి రూ.6 వరకు నష్టాన్ని భరిస్తున్నట్లుగా తెలుస్తోంది. కంపెనీ మార్జిన్ చూస్తే ఈ నష్టం పెరిగినట్లే. గతంలో వలె మార్జిన్ రావాలంటే కంపెనీలు ఒక్కో లీటర్ పైన రూ.9 వరకు పెంచవచ్చునని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. అయితే మోడీ ప్రభుత్వం రూ.1 నుండి రూ.3 వరకు సుంకం తగ్గిస్తే అప్పుడు సామాన్యుడిపై భారం రూ.6 వరకు ఉంటుంది. అయితే రిటైల్ ధరల పెంపు వల్ల ఆ ప్రయోజనం సామాన్యుడికి ఏ మేరకు ఉంటుందనే అంశం కూడా ఉంది.

150 డాలర్లకు చేరినా ఆశ్చర్యం లేదు
ప్రపంచ చమురు అవసరాల్లో రష్యా 10 శాతం తీరుస్తోంది. రష్యా నుండి ఐరోపాకు గ్యాస్‌ను సరఫరా చేసే పైప్ లైన్‌లలో మూడోవంతు ఉక్రెయిన్ నుండి వెళ్తున్నాయి. రష్యా చమురు సరఫరాలు దెబ్బతింటే స్వల్పకాలంలో చమురు 150 డాలర్లకు చేరినా ఆస్చర్యం లేదని చెబుతున్నారు. మాస్కో నుండి మన పెట్రో ఉత్పత్తుల దిగుమతుల వాటా 1 శాతమే. బొగ్గు దిగుమతుల్లో 1.3 శాతం ఉంది. కానీ అంతర్జాతీయ ప్రభావం మనపై ఉంటుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications