పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా తొమ్మిదో రోజు పెరిగాయి. ఓవైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుతున్నాయి. మరోవైపు మనవద్ద పెట్రోల్, డీజిల్ ధరలు వాహన వినియోగదారులకు షాకిస్తున్నాయి. జూన్ 7, ఆదివారం నుండి చమురు మార్కెట్ సంస్థలు ధరలను సమీక్షిస్తున్నాయి. వరుసగా ప్రతిరోజు పెరిగి, నేటి పెంపుతో ఏడాది కంటే అత్యధిక ధరలను తాకాయి. ఈ రోజు లీటర్ పెట్రోల్ పైన 46 పైసలు, లీటర్ డీజిల్ పైన 59 పైసలు పెరిగింది.

ఏ నగరంలో ఎంత ధర?
పెట్రోల్, డీజిల్ పైన వరుసగా 46 పైసలు, 59 పైసలు పెరగడంతో మెట్రో నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
- న్యూఢిల్లీ: పెట్రోల్ రూ.76.26, డీజిల్ రూ.74.62
- గుర్గావ్: పెట్రోల్ రూ.75.05, డీజిల్ రూ.67.45
- ముంబై: పెట్రోల్ రూ.83.17, డీజిల్ రూ.73.21
- చెన్నై: పెట్రోల్ రూ.79.96, డీజిల్ రూ.72.69
- హైదరాబాద్: పెట్రోల్ రూ.79.17, డీజిల్ రూ.72.93
- బెంగళూరు : పెట్రోల్ రూ.78.73, డీజిల్ రూ.70.95

9 రోజుల్లో పెరుగుదల
ఈ తొమ్మిది రోజుల్లో పెట్రోల్ ధర లీటర్ పైన రూ.4.98 పెరిగింది. అంటే రూ.5 పెరిగినట్లే. లీటర్ డీజిల్ పైన రూ.5.23 పెరిగింది. డీజిల్ పైన రూ.5 కంటే ఎక్కువే పెరిగింది. ప్రభుత్వం గత నెలలో పెట్రోల్ పైన రూ.10, డీజిల్ పైన రూ.13 ఎక్సైజ్ డ్యూటీని పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు అక్టోబర్ - నవంబర్ 2018 మధ్య కనిపించాయి. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. కరోనా - లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపు 82 రోజుల తర్వాత చమురు కంపెనీలు ధరలను సమీక్షించడం ప్రారంభించాయి.

ధరలు ఎందుకు పెంచుతున్నాయి
అంతర్జాతీయ మార్కెట్ ధరలు ఎలా ఉన్నప్పటికీ రిఫైనరీ, కార్యకలాపాలు సహా వివిధ ఖర్చుల కారణంగా చమురు రంగ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో వేతనాలు సహా వివిధ ఖర్చుల కారణంగా భారీగా నష్టపోయాయి. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు కొద్ది రోజుల పాటు పెంపు ఉంటుందని భావిస్తున్నారు. రిటైల్ ఇంధన ధరల్లో ఎక్సైజ్ సుంకాలు, వ్యాట్, సెస్ వంటివే 70 శాతంగా ఉన్నాయి. అందుకే పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని అధికార బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సుముఖంగా లేవు.

రూ.50 కంటే దిగువకు పెట్రోల్ ధరలు
నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని సుంకాలను వెనక్కి తీసుకుంటే పెట్రోల్, డీజిల్ ధరలు రూ.50 కంటే కిందకు వస్తాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. కాగా, కరోనా భయాల కారణంగా సోమవారం చమురు ధరలు 2 శాతం పడిపోయాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 66 సెంట్లు లేదా 1.7 శాతం నష్టపోయి బ్యారెల్‌కు 38.07 డాలర్లు, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ 81 సెంట్లు లేదా 2.2 శాతం పడిపోయి బ్యారెల్ 65.45 డాలర్లు పలికింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications