Petrol prices today: నాలుగు వారాలుగా ధరలు స్థిరంగానే..

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా దాదాపు నాలుగు వారాలుగా స్థిరంగా ఉన్నాయి. సోమవారం, మే 02వ తేదీన ధరలో ఎలాంటి మార్పులేదు. చివరిసారి 6, ఏప్రిల్ రోజున లీటర్ పెట్రోల్ పైన 80 పైసలు పెరిగింది. మార్చి 22వ తేదీ నుండి పక్షం రోజుల పాటు మొత్తం రూ.10 వరకు పెరిగింది. ఆ తర్వాత స్థిరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41, లీటర్ డీజిల్ ధర రూ.96.67 వద్ద ఉంది. గురుగ్రామ్‌లో పెట్రోల్ రూ.105.86, డీజిల్ రూ.97.10గా ఉంది.

మార్చి 22వ తేదీ నుండి దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను సవరిస్తున్నాయి. అంతకుముందు కేంద్రం పెట్రోల్, డీజిల్ పైన సెస్‌ను తగ్గించింది. ఆ తర్వాత నవంబర్ 4వ తేదీ నుండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. నాలుగున్నర నెలల పాటు స్థిరంగా ఉన్న ధరలు మార్చి 22వ తేదీ తర్వాత సవరణ ప్రారంభమైంది. పది రోజుల పాటు ధరలు పెరిగినప్పటికీ, ఇప్పుడు దాదాపు నెల రోజులుగా స్థిరంగా ఉన్నాయి.

Petrol Diesel price: Fuel rates remain unchanged on May 02, 2022

ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.120.51, డీజిల్ రూ.104.77, చెన్నైలో పెట్రోల్ రూ.110.85, డీజిల్ రూ.100.94, కోల్‌కతాలో పెట్రోల్ రూ.115.12, డీజిల్ రూ.99.83, బెంగళూరులో పెట్రోల్ రూ.111.09, డీజిల్ రూ.94.79గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.119.49, డీజిల్ రూ.105.49 వద్ద ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పలు ప్రాంతాల్లో సెంచరీని క్రాస్ చేశాయి. రాజస్థాన్‌లోని శ్రీ గంగాధరలో లీటర్ పెట్రోల్ రూ.123కు చేరుకుంది. ఇక్కడ డీజిల్ రూ.105.31గా ఉంది. బ్రెంట్ క్రూడ్ ధరలు 107 డాలర్ల వద్ద, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 105 డాలర్ల వద్ద ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+