Petrol, diesel prices: హైదరాబాద్‌లో రూ.116కు చేరుకున్న పెట్రోల్ ధర

పెట్రోల్, డీజిల్ ధరలు నేడు(ఏప్రిల్ 3, ఆదివారం) మళ్లీ పెరిగాయి. నవంబర్ 4, 2021 తర్వాత స్థిరంగా ఉన్న ధరలు మార్చి 22వ తేదీ నుండి పెరుగుతున్నాయి. ఈ పదమూడు రోజుల్లో రెండు రోజులు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఒకరోజు మాత్రమే 30 పైసలు పెరిగింది. 22 నుండి మిగతా పదిసార్లు 80 పైసల చొప్పున పెరిగింది. తాజా పెరుగుదలతో ఢిల్లీలో పెట్రోల్ రూ.103.41కు చేరుకుంది. డీజిల్ రూ.94.67గా ఉంది. మార్చి 22వ తేదీ నుండి ఈ పదమూడు రోజుల్లో పెట్రోల్ పైన రూ.8 పెరిగింది. ముంబైలో పెట్రోల్ రూ.118.41, డీజిల్ రూ.102.64, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.116.33కు చేరగా, డీజిల్ రూ.102.45కి చేరుకుంది.

అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఇటీవల భారీగా పెరిగి, ఆ తర్వాత కాస్త శాంతించాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లుగా కనిపించడంతో ధరలు కాస్త క్షీణించాయి. అయినప్పటికీ నాలుగు నెలల క్రితం ధరతో పోలిస్తే దాదాపు 30 డాలర్లు పెరిగింది. దీపావళి తర్వాత మన వద్ద ధరలు పెరగలేదు.

Petrol, diesel price: Fuel rates hiked today, petrol tops ₹118 in Mumbai

ఎన్నికలు, ఎన్నికల ఫలితాల తర్వాత పెరుగుతాయని భావించినప్పటికీ పెరగలేదు. దీపావళికి ముందు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ 70 డాలర్లకు కాస్త పైన ఉంది. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో 130 డాలర్లు దాటినప్పటికీ, ప్రస్తుతం కాస్త తగ్గి 110 డాలర్ల వద్ద ఉంది. నాలుగు నెలల్లో దాదాపు 30 డాలర్లు పెరగడంతో ధరలు పెరుగుతాయనే అంచనాలు మొదటి నుండి ఉన్నాయి. కానీ చాలా ఆలస్యంగా పెరిగాయి.

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (ఏప్రిల్ 3, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+