స్థిరంగా పెట్రోల్ ధరలు: అక్కడ తగ్గుదల, ఇక్కడ ధరలు తగ్గే అవకాశం

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 19వ రోజు మంగళవారం(నవంబర్ 23) స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. కొద్ది రోజుల క్రితం మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి దీపావళికి శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి లీటర్ పెట్రోల్, డీజిల్ పైన రూ.7 చొప్పున తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. ధరలు తాము తగ్గించేది లేదని చెబుతున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపు పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 మాత్రమే వర్తిస్తోంది. కేంద్రం తగ్గింపుకు రాష్ట్రాల వ్యాట్ తగ్గింపు తోడు కావడంతో పెట్రోల్ పైన రూ.12, డీజిల్ పైన రూ.17 వరకు తగ్గింది. పెట్రోల్, డీజిల్ ధరలు పలు నగరాల్లో రూ.100 దిగువకు వచ్చాయి. ఢిల్లీ (రూ.94.14), కోల్‌కతా (రూ.89.79), చెన్నై (రూ.91.43), భోపాల్ (రూ.90.87లలో డీజిల్ ధర రూ.100 లోపు ఉంది. కేంద్రం తగ్గింపు తర్వాత పలు రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయి. కానీ చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వ్యాట్ తగ్గించలేదు.

అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు ఇటీవల భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా ధరలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.108.20, లీటర్ డీజిల్ రూ.94.62గా ఉంది. విజయవాడలో నేడు ధరలు అతి స్వల్పంగా తగ్గాయి. లీటర్ పైన 57 పైసలు క్షీణించి రూ.110.36, లీటర్ డీజిల్ పైన 0.51 పైసలు తగ్గి రూ.96.45గా ఉంది.

Petrol Diesel Price: Fuel prises might reduce as crude slips due t covid fear

ఒపెక్ దేశాల నిర్ణయం

ఒపెక్ ప్లస్ దేశాలు చమురు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించినందున చమురు ధరలు సోమవారం ఒక శాతం మేర పెరిగాయి. అంతకుముందు దాదాపు నాలుగు శాతం మేర క్షీణించిన విషయం తెలిసిందే. అత్యధికంగా చమురు వినియోగించే దేశాలు తమ రిజర్వ్స్ నుండి చమురు నిల్వలు రిలీజ్ చేయడం వంటి అంశాలు ప్రభావం చూపనున్నాయి.
సోమవారం చమురు ధరలు పెరిగాయి. కానీ యూరోపియన్ ప్రాంతంలో కరోనా కేసులు పెరగడం, జపాన్, భారత్ వంటి దేశాల్లో చమురు నిల్వలు ఉండటం, ఈ దేశాల్లో ఓవర్-సప్లై, బలహీన డిమాండ్ ఉండటం వంటి అంశాలు ప్రభావం చూపనున్నాయి.

సోమవారం బ్రెంట్ క్రూడ్, యూఎస్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ ధరలు 1 శాతం చొప్పున లాభపడ్డాయి. అక్టోబర్ 1వ తేదీ తర్వాత కనిష్టానికి చేరుకున్న అనంతరం నిన్న ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 1 శాతం పెరిగి 79.70 డాలర్లకు, యూఎస్ క్రూడ్ 1 శాతం పెరిగి 76.73 డాలర్లకు చేరుకుంది. అయితే యూరోపియన్ ప్రాంతాల్లో కరోనా లాక్ డౌన్ కారణంగా చమురు డిమాండ్ పైన ప్రభావం పడి, మున్ముందు తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+