ముంబై: పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (జూన్ 6) కూడా పెరిగాయి. పెరుగుతున్న చమురు ధరలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నేడు లీటర్ పెట్రోల్ 28 పైసలు, లీటర్ డీజిల్ 31 పైసలు పెరిగింది. ఈ నెలలో ధరల పెరుగుదల ఇది మూడోసారి. గత నెలలో పెట్రోల్ డీజిల్ ధరలు పదహారు సార్లు పెరిగాయి. ఈ నెలలో ఆ ఆరు రోజుల్లో మూడుసార్లు పెరిగాయి. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీల ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76 నుండి రూ.95.03, లీటర్ డీజిల్ రూ.85.66 నుండి రూ.85.95కి పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో రూ.100
హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.76, డీజిల్ ధర రూ.93.70కి చేరుకుంది. ఇంధనం నిల్వ కేంద్రం నుండి రవాణా దూరం ఆధారంగా ఇప్పటికే రాష్ట్రంలోని ఆదిలాబాద్, జోగులాంబ, కుమురం భీం, నిర్మల్ జిల్లాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపూర్, చిత్తూర్, తూర్పు గోదావరి, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100కు చేరుకుంది.

ఆరు నగరాల్లో రూ.100 క్రాస్
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ప్రస్తుతం రూ.101.25, డీజిల్ ధర లీటర్‌కు రూ.93.10 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు లీటర్ రూ.95.03, డీజిల్ ధర రూ.85.95గా ఉన్నాయి. చైన్నైలో లీటర్ పెట్రోల్ రూ.96.47, కోల్‌కతాలో రూ.95.02, బెంగళూరులో రూ.98.20, లక్నోలో రూ.92.29కు చేరింది. డీజిల్ లీటర్ ధర చైన్నైలో రూ.90.66, కోల్‌కతాలో రూ.88.80, బెంగళూర్‌లో రూ.91.12, పాట్నాలో రూ.91.24కు చేరుకుంది. అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.33కు చేరుకుంది. డీజిల్ కూడా రూ.100కు చేరువైంది. దేశంలోని ఆరు నగరాల్లో పెట్రోల్ రూ.100 దాటింది.

అక్కడా పెరుగుతున్న ధరలు
పెట్రోల్, డీజిల్ పైన ప్రభుత్వ పన్నుల వాటా అధికం. ఉదాహరణకు ఢిల్లీలో చూసుకుంటే గత నెల 16న లీటర్ పెట్రోల్ రూ.92.88గా ఉంది. ట్యాక్స్ బ్రేక్ చూసుకుంటే లీటర్ పెట్రోల్ బేస్ ప్రైస్ రూ.34.19. రవాణా తదితర ఖర్చులు 0.36 పైసలు. డీలర్స్‌కు వేసే ఛార్జ్ (ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ మినహా) రూ.34.55. ఎక్సైజ్ డ్యూటీ రూ.32.90. డీలర్ కమిషనర్ (యావరేజ్) రూ.3.77. వ్యాట్ రూ.21.36. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ మే 16వ తేదీన రూ.83.22గా ఉంది. ట్యాక్స్ బ్రేక్ చూస్తే బేస్ ప్రైస్ రూ.36.32. రవాణా తదితర ఖర్చులు 0.33 పైసలు. డీలర్స్‌కు వేసే ఛార్జ్ (ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ మినహా) రూ.36.65. ఎక్సైజ్ డ్యూటీ రూ.31.80. డీలర్ కమిషనర్ (యావరేజ్) రూ.2.58. వ్యాట్ రూ.12.19. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. చమురు ధరలు బ్యారెల్ 72 డాలర్లకు చేరుకుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications